Breaking News

రాష్ట్రంలో మాల యువతకు వివిధ పథకాలతో ప్రోత్సాహం అందిస్తా…

– డా. పెదపూడి విజయ్ కుమార్, మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గతం ప్రభుత్వం మాలల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ (APSCCFC) చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్మన్ గా డా. పెదపూడి విజయ్ కుమార్ బుధవారం తాడేపల్లి లోని షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆఫీసు లో బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ మాల కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు. గత ఐదు సంవత్సరాలు పాటు సంక్షేమ రంగాన్ని తుంగలో తొక్కడంతో పాటు ఎంతో నిర్లక్ష్యానికి గత ప్రభుత్వం గురిచేసిందన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాల యువత అభివృద్ధికి అందించాల్సిన పథకాలను కూడా ఇవ్వకుండా మళ్లింపు చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి ఎంతో నిబద్దతతో కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన పథకాలు అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అందువల్లే ప్రతి కార్పొరేషన్ కు కూడా పాలక మండళ్లు నియామకాలు చేస్తున్నారన్నారు. మాల యువతను సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో భాగస్వాములను చేసేందుకు చైర్మన్ గా తన వంతు సహకారం అందిస్తానన్నారు. కూటమి ప్రభుత్వం రూ. 18,000 కోట్లకు పైగా సంక్షేమ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు చేశారని, రూ. 340 కోట్లు రాయితీలకు కేటాయింపు చేశారన్నారు.. మాలల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో అనుకూలంగా ఉందని మాల యువతకు కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలు అందిస్తానన్నారు.
కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు ఏలూరి సాంభశివరావు, అశోక్ రెడ్డి, విజయ్ కుమార్, గిడ్డి సత్యనారాయణ, ఉగ్ర నరసింహా రెడ్డి, ఏపీ మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శివ దత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ వీసీ మరియు జనరల్ మేనేజర్ కే. కృష్ణ వేణి, గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రేమ కుమారి, ఈవో ఎన్. మంగారావు, నాయకులు తదితరలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *