Breaking News

నేచుర‌ల్ ఫార్మింగ్ లో ఏపి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో వుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎ.పి.ఎస్.వో.పి.సి.ఎ ఛైర్మ‌న్ గా ప్ర‌మాణ స్వీకారం చేసిన శావ‌ల దేవ‌ద‌త్తు
-ఈ కార్య‌క్ర‌మానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌రు.
-సైనికుడిలా ప‌నిచేసిన నాయ‌కుడు దేవ‌ద‌త్తు
-లాభసాటి వ్య‌వ‌సాయానికి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ఒక్క‌టే మార్గం
-త్వ‌ర‌లో తిరువూరుకి కొత్త ప‌రిశ్ర‌మ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపి స్టేట్ ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ (ఎ.పి.ఎస్.వో.పి.సి.ఎ) కార్పొరేష‌న్ కొత్తగా ఏర్పడిన రాబోయే కాలంలో ఈ కార్పొరేష‌న్ కి ప్రాధాన్య‌త చాలా పెర‌గునుంది. దేశంలోనే మ‌న రాష్ట్రం నేచుర‌ల్ ఫార్మింగ్ లో మొద‌టి స్థానంలో వుంది. ఇత‌ర రాష్ట్రాల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చే స్థాయిలో రాష్ట్రంలో నేచుర‌ల్ ఫార్మింగ్ వుంది. ఈ కార్పొరేష‌న్ ఇచ్చే ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేట్ మీదే మొత్తం ఆధార‌ప‌డి వుంటుంది. అందుకే కొత్త కార్పొరేష‌న్ ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు.

టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి శావ‌ల దేవ‌ద‌త్తు ఏపి స్టేట్ ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ చైర్మ‌న్ గా ప్ర‌మాణ‌స్వీకార‌మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మం బుధ‌వారం గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ఆడిటోరియంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. శావ‌ల దేవ‌ద‌త్తు ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌టంతో పాటు శాలువాతో స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ రైతుల‌కు వ్య‌వ‌సాయం లాభ‌సాటిగా మారాలంటే నేచుర‌ల్ ఫార్మింగ్ ఒక‌టే మార్గం అన్నారు. రైతులంద‌రూ వ్య‌వ‌సాయ రంగంలో వ‌చ్చిన కొత్త విధానాలు, కొత్త ప‌ద్ద‌తులు నేర్చుకోవాల‌ని ..అలాగే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఎన్నో స‌బ్సీడీలు ఇస్తుంది. వాటిని ఉప‌యోగించుకునే విధంగా రైతుల‌కి అవ‌గాహ‌న పెంచి ముందుకి తీసుకువెళ్లాల‌ని శావ‌ల దేవ‌ద‌త్తుకి సూచించారు.

ఏపి స్టేట్ ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ చైర్మ‌న్ గా శావ‌ల దేవ‌ద‌త్తును నియ‌మించినందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు , ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞ‌తలు తెలిపారు. దేవ‌ద‌త్తు స్వ‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్డీయే కూట‌మి గెలుపుకి ఎంతో ఉపయోగ‌ప‌డ్డాయన్నారు. ఎన్.ఆర్.ఐ గా వ‌చ్చిన దేవ‌ద‌త్తు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశ్యంతో గ‌త నాలుగేళ్లుగా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిరంత‌రం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుండి ప‌లు ప్ర‌జా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అలాగే 40 రోజులు పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని గ్రామాల్లో పాద‌యాత్ర నిర్వ‌హించి గ్రామ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నాడ‌ని కొనియాడారు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌నకి రావాల్సిన సీటు రాలేక‌పోయినా పార్టీ అధిష్టానం, చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు తెలుగుదేశం సైనికుడిలా, ఎక్క‌డ కూడా తొంద‌ప‌డ‌కుండా…పార్టీ పై న‌మ్మ‌కంతో ప‌నిచేశాడ‌న్నారు. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్ధి గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడని తెలిపారు. శావ‌ల దేవ‌ద‌త్తు కృషి మ‌ర్చిపోలేనిదని చెప్పారు. దేవ‌ద‌త్తుకి మొద‌టి నుంచి మంచి ప‌ద‌వి రావాల‌ని ఆక్షాంక్షించిన‌ట్లు తెలిపారు. ఆ విధంగానే ప‌ద‌వి రావ‌టం త‌న‌కి ఎంతో సంతోషం క‌లిగించిద‌న్నారు. త‌ను ఎంపి గా గెలిచిన‌ప్ప‌టికంటే..దేవ‌ద‌త్తుకి ప‌ద‌వి రావ‌టంమ‌రింత ఆనందాన్ని ఇచ్చింద‌ని తెలిపారు. దేవ‌ద‌త్తుకి తెలియ‌ని విష‌యాలు చ‌దివి తెలుసుకునే అల‌వాటు వుంది. అలాగే ఈ కార్పొరేష‌న్ పై అవగాహ‌న పెంచుకుని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.

తిరువూరుకి కొత్త ప‌రిశ్ర‌మ రాక‌
వ్య‌వ‌సాయానికి సంబంధించిన స‌మ‌స్య‌లు అధిక‌మించేందుకు అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ ను ఉప‌యోగించుకుని తిరువూరు రైతులు నేచుర‌ల్ ఫార్మింగ్ లో ముందుండాల‌ని ఆకాంక్షించారు. తిరువూరు అభివృద్ది దిశ‌గా న‌డిపించేందుకు ఒక ప‌రిశ్ర‌మ స్థాప‌న గురించి ఆలోచిస్తున్న‌ట్లు చెప్పారు.త‌ర్వ‌లోనే అన్ని విష‌యాలు ప్ర‌క‌టిస్తామ‌న్నారు. తిరువూరులో ఆ ప‌రిశ్ర‌మ‌, నేచుర‌ల్ ఫార్మింగ్ ప్రారంభం అయితే వెనుక‌బ‌డన తిరువూరు ప్రాంతం జిల్లాలో అభివృద్దిలో ముందున్న అన్ని ప్రాంతాల‌ను దాటుతుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎ.పి.ఎస్.వో.పి.సి.ఎ డైరెక్ట‌ర్ విన‌య్ చందు, ఎన్.జి.రంగా అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీ ఉప‌కుల‌ప‌తి ఆర్.శార‌ద దేవి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్య‌క్షులు చెరుకూరి రాజేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, తిరువూరు టిడిపి ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బొమ్మ‌సాని ఉమామ‌హేష్, జ‌న‌సేన నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ మ‌నుబోలు శ్రీనివాస్, బిజెపి నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ పెనుగొండ రామ‌చంద్ర‌రావు, గంప‌ల గూడెంమండ‌ల పార్టీ అధ్య‌క్షుడు రేగుల వీరారెడ్డి, తిరువూరు వెంక‌ట న‌ర్సిరెడ్డి, విస్స‌న్న పేట మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు మ‌ట్టా వేణుగోపాల‌రావు, మాజీ ఎ.ఎమ్.సి చైర్మ‌న్ తాళ్లూరి రామారావు ల‌తోపాటు తిరూవూరు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *