అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుపై అధికారులతో బుధవారం నాడు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా..ప్రాజెక్టు వివరాలు, పెండింగ్ పనులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. స్మృతి వనం ప్రాజెక్టును ఏపీఐఐసీ నిర్మిస్తోందని, దాని నిర్వహణ బాధ్యతలు విజయవాడ మున్సిపల్ …
Read More »Tag Archives: AMARAVARTHI
మంకీపాక్స్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే దిల్లీలో మూడు నోడల్ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు RT-PCR వ్యాధి నిర్థరణ పరీక్ష చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆఫ్రికాలో …
Read More »అన్న క్యాంటీన్లకు మాజీ ఎంపీ గోకరాజు కోటి విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ చెక్‌ను ఆదివారం మంత్రి నారా లోకేశ్‌కు అందజేశారు. గంగరాజు చేయూతకు, ఉదార సహకారానికి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెరుగైన ఆంధ్రప్రదేశ్‌కు బాటలు వేసేందుకు వివిధ భాగస్వాములు కలిసి వస్తున్నందుకు సంతోషిస్తున్నానంటూ, గంగరాజు విరాళమిచ్చిన ఫొటోను ‘ఎక్స్’లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
Read More »మినిస్టర్ అయినా… ప్రజలకు సేవకురాలే…
-మోకాలి లోతు నీటిలో మహదేవ పల్లి రైల్వే అండర్ పాస్ -దగ్గరుండి నీటిని తోడించిన మంత్రి -మంత్రి సవితమ్మ చొరవపై స్థానికుల ప్రశంసలు పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అధికారులకు చెప్పి ఆ సమస్యను పరిష్కరిస్తారు కొందరు ప్రజా ప్రతినిధులు. ఇంకొందరైతే… తర్వాత చూద్దామంటారు. కానీ …రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పని తీరు ఈ రెండింటికీ భిన్న్నం. సమస్యపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా… తాను సమస్యను స్వయంగా గుర్తిస్తే చాలు… వెంటనే పరిష్కారానికి …
Read More »తుంగభద్ర డ్యామ్ లో స్టాప్ లాగ్ గేట్ అమరికలో మొదటి భాగం పూర్తి పై చంద్రబాబు అభినందనలు
-సమిష్టిగా పనిచేసి విజయం సాధించారన్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుంగభద్ర డ్యామ్ లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేట్ అమరిక ప్రక్రియ విజయవంతం అవ్వడంపై సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 6 రోజుల క్రితం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అనివార్యంగా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. డ్యామ్ నుంచి దాదాపు 60 టిఎంసి నీటిని విడుదల చేస్తే తప్ప స్టాప్ లాగ్ గేట్ అమర్చడం సాధ్యం కాని పరిస్థితిలో అధికారులు అత్యంత …
Read More »ప్రజలకు సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించేలా ఆసుపత్రుల ప్రక్షాళన
-ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక అమలు -దశల వారీగా స్వల్ప, మధ్య, దీర్ఝకాలిక ప్రణాళికలు అమలు చేసేందుకు చర్యలు -ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎటు వంటి అంతరాయం ఉండబోదు, ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించాం మరో రూ.300 కోట్లు త్వరలో చెల్లిస్తాం -గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకవతకలపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు …
Read More »తాడేపల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ’’ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే …
Read More »త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
జనరల్ డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు. శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్ మాతాకీ అంటూ …
Read More »ఏపీని స్టార్టప్ హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి
-ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ లో అగ్రగామిగా నిలపాలి -ఐటి కంపెనీలను రాష్ట్రంలోకి ఆహ్వానించాలి -ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ శాఖను ఏర్పాటు చేయాలి -డ్రోన్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించండి -యాప్ ఆధారిత సేవలను ఔత్సాహికులకు అందుబాటులోకి తేవాలి -ఐటీ, ఎలక్ట్రానిక్స్-కమ్యునికేషన్స్ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, ఆదిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఐటి …
Read More »రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు
-ఒక్కోపార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పార్కులు ఏర్పాటు లక్ష్యం -విజయవాడ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలి -ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం -పరిశ్రమలు, ఎంఎస్ఎఈ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యానవన రంగాలతో పాటు ఖనిజాధారిత పారిశ్రామికాభివృద్ధి పార్కులు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నందుకు వాటి ఏర్పాటుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. …
Read More »