Breaking News

Tag Archives: AMARAVARTHI

మత్స్య వేటకు అవకాశం లేక నష్ట పోతున్న మత్స్యకారులు..

-మెంటాడ పర్యటనలో ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకుని వచ్చిన ప్రజలు ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త : రణస్థలం మండలం మెంటాడలో ఈ రోజు ఒక ప్రయివేట్ కార్యక్రమంలో హాజరైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) దృష్టికి ఆ గ్రామ ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను తీసుకుని వచ్చారు. దానిలో భాగంగా మెంటాడ రేవులో స్ధానిక పరిశ్రమల నుండి వెలువడుతున్న కాలుష్యపు నీరు సముద్రంలో చేరుతున్న దృశ్యాల్ని ప్రత్యక్షంగా చూపించి, తద్వారా జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దీని కారణంగా చేపల …

Read More »

ఇప్పుడు ప్రతి గడపలో డాక్ చౌపాల్-మన పోస్టాఫీసు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం (ఈ నెల 07) డాక్ చౌపాల్ (గడపకు-గడపకు-పోస్టాఫీసు) అనే కార్యక్రమం గన్నవరంలో ని ఆర్. టి. సి. వర్క్ షాప్ నందు ఉదయం 11.00 గంటల కు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్. టి సి సిబ్బంది మరియు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ ఎమ్.నరసింహ స్వామి మరియు తపాలా శాఖ ఇన్స్పెక్టర్ ఎమ్. సత్యనారాయణ పాల్గొని తపాలా శాఖ ఇచ్చే సేవల గురించి వివరించడం జరుగుతుంది. కావున గన్నవరం మరియు తదితర ప్రాంత ప్రజలు …

Read More »

ఏపీలో పెట్టుబడుదారులకు విస్తృత అవకాశాలు

-రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ -విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే సంస్థలతో చర్చలకు సిద్ధం -ఎనర్జీ అసోషియేషన్స్ తో భేటీలకు విద్యుత్ శాఖ ప్రాధాన్యం -గత ఐదేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు శూన్యం -పెట్టుబడిదారులను వైసీపీ భయపెట్టింది -సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సన్ రైజ్ స్టేట్ గా ఏపీ -ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఉన్నాయని మంత్రి గొట్టిపాటి …

Read More »

మిషన్‌ లైఫ్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌ ‘లీడర్‌’

-ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణలో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతాం -జీవన ప్రమాణాలు పెంపొందించడంలో నంబర్‌ వన్‌గా నిలిచేందుకు కృషి -స్థిరమైన జీవన ప్రమాణాలు, ఇంధన భద్రతని ప్రోత్సహించేలా మిషన్‌ లైఫ్‌ -పునరుత్పాదక ఇంధనవనరులు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత పర్యాటక రంగం, -ఇంధన సామర్థ్యంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి -స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధికి మిషన్‌లైఫ్‌ తోడ్పాటు -ఏపీలోని ప్రతి ప్రాంతానికి మిషన్‌లైఫ్‌ చేరుకోవడం లక్ష్యం -అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజలకు 24/7 నాణ్యమైన -విద్యుత్‌ సరఫరా చెయ్యడమే సీఎం …

Read More »

పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీ పై విత్తన పంపిణి

-ఎన్డీయే ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం  -తక్షణ అమలుకు ఆదేశాలు  -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అధిక వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు  కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతు మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టే రైతుల కష్టాలు తెలుసుకుని …

Read More »

భగవద్ రామానుజాచార్యుల వారి ‘హృదయార్చన’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో ఆదివారం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు శ్రీమన్ పురాణం వెంకటాచార్యులు నిర్వహణలో సంగీత గురువులు శ్రీమాన్ దుర్గారావు, రూపకుమారి, తేజస్విని, ప్రత్యక్ష పర్యవేక్షణలో, G.T.A ( గ్రాటిట్యూడ్ ఆఫ్ ఆచార్య ) ఆధ్వర్యంలో భగవద్ రామానుజాచార్యుల వారిని స్తుతిస్తూ ‘హృదయార్చన’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొని రామానుజుల వారి సంకీర్తనలతో సనాతన ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తూ కీర్తనలు చేశారు. …

Read More »

2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే సీఆర్డీయే పరిధి : సీఎం నారా చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సీఆర్డీయే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే సీఆర్డీఏ పరిధి కొనసాగుతుందని పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపై సీఎం చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. గతంలో ల్యాండ్ …

Read More »

మైనింగ్ శాఖలో గత 5 ఏళ్ల అక్రమాలను పూర్తిగా తవ్వితీయండి

-ఇసుక, సిలికా, క్వార్జ్ట్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు పక్కాగా సేకరించండి -2014-19 మధ్య మైనింగ్ ఆదాయంలో 24 శాతం గ్రోత్ ఉంటే…గత ప్రభుత్వంలో 7 శాతానికి పడిపోయింది -ఉచిత ఇసుక పాలసీకి కట్టుబడి ఉన్నాం…రవాణా భారం తగ్గించే అంశంపై దృష్టిపెట్టండి. -రీచ్ నుంచి నేరుగా వినియోగదారుడికి ఇసుక అందించడంపై కసరత్తు -మైనింగ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు -గనుల శాఖలో అస్తవ్యస్థ విధానాలు, అవినీతి వల్ల ప్రభుత్వం రూ.9,750 కోట్లు నష్టపోయిందని వివరించిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

గల్ఫ్ వెళ్ళే వారి కొరకు ప్రయాణ ముందస్తు అవగాహన శిక్షణ సదస్సు కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు ముందుగా ప్రయాణం ముందు అవగాహన శిక్షణ తీసుకుంటే సురక్షితమని మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని విదేశీ వ్యవహారాల శాఖచే గుర్తించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ap లిమిటెడ్ ఏజెన్సీ యొక్క జనరల్ మేనేజర్ బిఆర్ క్రాంతి కుమారి ఇవాళ ఓంకాప్ ఆఫీసు విజయవాడలో జరిగిన ఆరు జిల్లాల ఉపాధి కల్పనా …

Read More »

ఆగస్టు 1నుండి నుండి తల్లిపాల వారోత్సవాలు

-బ్రెస్ట్ ఫీడింగ్‌పై పోస్టర్లను విడుదల చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి కృష్ణబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నాం అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. బుధవారం వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్‌లోని 5వ …

Read More »