-మెంటాడ పర్యటనలో ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకుని వచ్చిన ప్రజలు
ఎచ్చెర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రణస్థలం మండలం మెంటాడలో ఈ రోజు ఒక ప్రయివేట్ కార్యక్రమంలో హాజరైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (NER) దృష్టికి ఆ గ్రామ ప్రజలు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను తీసుకుని వచ్చారు. దానిలో భాగంగా మెంటాడ రేవులో స్ధానిక పరిశ్రమల నుండి వెలువడుతున్న కాలుష్యపు నీరు సముద్రంలో చేరుతున్న దృశ్యాల్ని ప్రత్యక్షంగా చూపించి, తద్వారా జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దీని కారణంగా చేపల వేట జరపలేక జీవనాధారానికి ఇబ్బంది కలుగుతుందని తమ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్యే NER పరిశ్రమల యాజమాన్యం తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే బూటుపేట నుండి మెంటాద, మెంటాడ నుండి బీచ్ వరకు సీసీ రోడ్ మరియు గ్రావెల్ రోడ్ నిర్మాణం జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో విష్వక్సేన్, సీరపు పైడియ్య రెడ్డి, లెంక శ్యామల రావు, పీసిని జగన్నాధ నాయుడు, కొర్లయ్య,రాముడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News