Breaking News

భగవద్ రామానుజాచార్యుల వారి ‘హృదయార్చన’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో ఆదివారం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు శ్రీమన్ పురాణం వెంకటాచార్యులు నిర్వహణలో సంగీత గురువులు శ్రీమాన్ దుర్గారావు, రూపకుమారి, తేజస్విని, ప్రత్యక్ష పర్యవేక్షణలో, G.T.A ( గ్రాటిట్యూడ్ ఆఫ్ ఆచార్య ) ఆధ్వర్యంలో భగవద్ రామానుజాచార్యుల వారిని స్తుతిస్తూ ‘హృదయార్చన’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొని రామానుజుల వారి సంకీర్తనలతో సనాతన ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తూ కీర్తనలు చేశారు. భగవద్ రామానుజచార్యులు వారు చేసిన ఎన్నో సంఘసంస్కరణను కొనియాడుతూ, యావత్ ప్రపంచానికి వారిని గురించి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ హృదయార్చన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *