Breaking News

Tag Archives: AMARAVARTHI

సీఎం చంద్రబాబు నాయుడుతో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీ ప్రతినిధుల భేటీ

-రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బిపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం …

Read More »

రాష్ట్రంలో రూ. 75వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధం.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

-ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌మావేశ‌మైన భార‌త్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ప్ర‌తినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు స‌మావేశ‌మైన‌ట్లు మంత్రి చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ …

Read More »

ఏపీలో రూ. 4 వేల కోట్ల‌ పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి విన్ ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, సంస్థ ప్రతినిథులు స‌మావేశ‌మైన‌ట్లు మంత్రి టి.జి తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన …

Read More »

అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి

-పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన -అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి -కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి -జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి -కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం -జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీశాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని …

Read More »

పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేస్తాం

-వసతి గృహాల్లో ఖాళీలు త్వరలో భర్తీచేస్తాం -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని,వసతి గృహాల్లో ఖాళీలు భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.వెలగపూడిలోని సచివాలయంలో మూడవ రోజు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎస్.ఎఫ్.ఐ విద్యార్ది సంఘ నాయకులు,సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు …

Read More »

రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం

-గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు -రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ద్వేయం

-సచివాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ద్వేయమని తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు. వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ప్రతినిధులు, …

Read More »

“అగ్నిమాపక సేవల ఆధునికీకరణ”

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు హోమ్ శాఖ మంత్రి  వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర విపత్తులు న్విహణ మరియు అగ్నిమాపక శాఖ ” పై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. Principle Secretary, Home Dept. హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, మరియు DG ఫైర్ గా పూర్తి అదనపు భాద్యతలు నిర్వహిస్తున్న శంక బత్ర బాక్షి IPS గారు మరియు ఫైర్ శాఖ అదనపు సంచాలకులు, ఫైర్ అధికారులు పాల్గున్నారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన, అగ్నిమాపక …

Read More »

పర్యావరణహితంగా వేడుకలు… ఉత్సవాలు చేసుకొంటే మేలు

-వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలూ పవన్ కళ్యాణ్ కార్యాలయానికి …

Read More »

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తా

-పవన్ కళ్యాణ్ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా -శాసన మండలి సభ్యునిగా ధ్రువీకరణ పత్రం స్వీకరించిన పి. హరిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి. హరిప్రసాద్  స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన తరఫున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పి. హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీగా …

Read More »