Breaking News

చుక్కలు చూపిస్తున్న టమాటా… ధర ఏకంగా రూ.100

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది. సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాకు టాటా చెబుతున్నారు. హైదరాబాద్లో రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, మచ్చలున్న, మెత్తటి టమాటాలు తీసుకోవాలంటున్నారని వాపోతున్నారు. ఇక బహిరంగ మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయాలు సాగిస్తుండటంతో చాలా మంది మధ్యతరగతి వినియోగదారులు అసలు టమాటాల వైపే చూడటం లేదు. ప్రతిరోజూ నగరంలో రైతుబజార్లకు 6వేల క్వింటాళ్ల టమాటాలు వచ్చేవి. తొలకరి పంట చేతికందక ప్రస్తుతం 2.5 నుంచి 3వేల క్వింటాళ్లే వస్తోంది. దీంతో డిమాండ్‌ పెరిగి ధర కొండెక్కిందని వ్యాపారులు అంటున్నారు. సెప్టెంబరు వరకు దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముందని చెబుతున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 30న పేద‌లకు ప‌ట్టాభిషేకం..

– సీఎం చేతుల మీదుగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ప‌ట్టాల పంపిణీ – తొలిద‌శ‌లో 24,042 మంది ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *