Breaking News

Tag Archives: AMARAVARTHI

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం తాత్కాలిక వాయిదా

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : Dr. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి లో నిర్వహిస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం C K Convention, మంగళగిరి లో చేయుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, మంత్రులు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులందరూ వివిధ జిల్లాల్లో వచ్చిన వరద బాధితుల సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం మరియు పురస్కార గ్రహీతల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాల్సిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవం …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం

-వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూపాయలు ఐదు లక్షల చొప్పున సహాయం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కుండ పోత వర్షాలు, ఉదృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ కి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్ లో ఉన్నారని …

Read More »

ఏపీలో ప్రభుత్వేతర రంగంలో ‘అందుబాటు ధర’కే ఆరోగ్య సంరక్షణ సేవలకు భారీ డిమాండ్

-పీపీపీ కింద ఏపీలో 175 ఆసుపత్రులు, మెగా హెల్త్ సిటీ ఏర్పాటు -నియోజకవర్గానికో ఆసుపత్రి ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన -ప్రభుత్వాసుపత్రుల్లో రోగనిర్ధారణ, చికిత్స సౌకర్యాల మెరుగుకు కృషి -ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఫ్లోరిడా లో వివరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ -వైద్యఆరోగ్య రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు విశేషమైన అవకాశాలు -రంగరాయ, సిద్ధార్థ, గుంటూరు వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ద్వైవార్షిక సదస్సులో మంత్రి కీలకోపన్యాసం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య …

Read More »

రహదారులు, భవనాల రక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి -ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాలు కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన …

Read More »

ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

-సహాయక చర్యల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు  -మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్ లతో పశువుల వైద్యం, జంతు వైద్య శిబిరాల ద్వారా వైద్య సేవలు  -163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యలు  -కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ  -వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు, కాలువల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితిపై …

Read More »

కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న ప్రధాని కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చిన ప్రధాని ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని …రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన మోది తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి …

Read More »

50 మంది కాపరులు, 3501 జీవాలను కాపాడిన అధికార యంత్రాంగం

-ప్రాణాల మీదకు తెచ్చిన బ్రతుకుతెరువు -నెలల తరబడి లంకల్లో జీవాలను మేపుకునే కాపరులు -రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లంకలు ముంపుకు గురయ్యే పరిస్థితి -బిక్కుబిక్కుమంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చెరవేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, వైకుంఠపురం, గిడుగు, పొందుగల, మునుగోడు. పల్నాడు జిల్లా, అమరావతి మండలంలో కృష్ణా నది ఒడ్డున ఈ గ్రామాల లంకలు పచ్చని బయల్లకు ప్రసిద్ధి. బోట్లలో వందల సంఖ్యలో లంకల్లోకి జీవాలను తోలుకు వెళ్లి నెలల తరబడి అక్కడే నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగించే …

Read More »

పంట నష్టం అంచనా వేయండి

-పంట నష్టం అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు వేగవంతం చేయండి -డ్రెయిన్ కాలువలు క్లియర్ చేసి నీటి నిల్వలు మళ్లించండి  -పశువులు మృత్యువాత పడకుండా అధికారులు, సిబ్బంది మందులతో అందుబాటులో ఉండాలి  -వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల కాల్ సెంటర్లు కొనసాగించండి  -పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది సెలవులు పెట్టకండి  -రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు  అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే పంట …

Read More »

మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి…

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి  వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో …

Read More »

గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

-బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను వెనక్కు పంపిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా….బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, …

Read More »