Breaking News

Tag Archives: AMARAVARTHI

2023 నాటికి లక్షా 8వేల 553కోట్లతో పేదలందరికీ 28లక్షల 30వేల ఇళ్ళ నిర్మాణం…

-మొదటి దశలో 15లక్షల 60వేలు,రెండవ దశలో 12లక్షల 70వేల ఇళ్ళ నిర్మాణం -ఇళ్ళ నిర్మాణ కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలకే 34వేల 109 కోట్లు ఖర్చు -23వేల 500కోట్లతో 68వేల 677 ఎకరాలు సేకరించి ఇళ్ళ స్థలాలుగా పంపిణీ -ప్రతి లేఅవుట్ కు మండల స్థాయి,నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారి ఇన్చార్జి -వందేళ్ళ వరకూ నిలిచేలా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం -రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి సిహెచ్ శ్రీరంగనాధరాజు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా …

Read More »

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రపంచ పులుల దినోత్సవం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పులుల సంరక్షణకోసం తీసుకున్న చర్యలను  రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని తెలిపిన అధికారులు. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని తెలిపిన అధికారులు కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా …

Read More »

నేడు జగనన్న విద్యా దీవెన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది రెండవ విడత విద్యాదీవెనలో భాగంగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ.693.81 కోట్లను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో గురువారం బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో సీఎం వైయస్‌.జగన్‌ జమచేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ పిల్లలకు మన తరపున ఇచ్చే ఆస్తి చదువు… ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో అక్షరాలా 10.97లక్షల పైచిలుకు పిల్లలకు దాదాపు రూ.694 కోట్లు నేరుగా …

Read More »

నవరత్నాలు – పేదలందరీకి ఇళ్లు….. : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు – పేదలందరీకి ఇళ్లుసమీక్ష సమావేశం లో గురువారం  మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మైలవరం నియోజకవర్గం లో నవరత్నాలు – పేదలందరీకి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం లో భాగంగా శాసనసభ్యునిగా తన వంతుగా చేపట్టిన కార్యక్రమాలు, పేదలకు అందిస్తున్న సహాయ సహకారాలు గురించి వివరించారు. మైలవరం తో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు కూడ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న …

Read More »

వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తాం… :  ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే ఆర్కే గురువారం సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే  మాట్లాడుతూ యార్డ్ నందు సుమారు 8 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని అధికారుల లెక్కల ద్వారా తెలుసుకోవడం జరిగిందని, త్వరలో ఉన్నతాధికారులను కలిసి ఈ నిధులను మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరికీ ఉపయోగించే విధంగా టార్పాలిన్ పట్టాలను, తైవాన్ స్ప్రేయర్లను అద్దెకు ఇచ్చే విధంగా, వ్యవసాయ పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని …

Read More »

ఆప్కో బలోపేతానికి విశేష కృషి చేసిన అంబేద్కర్…

-ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆప్కో బలోపేతానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని ఆ సంస్థ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అన్నారు. ఆప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా సంయిక్త పాలనాధికారిగా బదిలీపై వెళుతున్న అంబేద్కర్ కు ఆప్కో అధికారులు, సిబ్బంది మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత ఆప్కో చైర్మన్ మోహనరావు అంబేద్కర్ ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆప్కో జీఎం లేళ్ల …

Read More »

ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో ఏపిజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలామ్ వర్దంతి కార్యక్రమం ఎమ్మెల్యే ఆర్కే పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అబ్దుల్ కలామ్  ఆశయాలకు అనుగుణంగా మనమందరం ఆయన బాటలో నడవాలని అన్నారు. జీవితంలో పైకి ఎదగాలంటే పేదరికం అడ్డుకాదాని నిరూపించారని, పేపర్ బాయ్ నుండి భారత రాష్ట్రపతి స్థాయికి చేరటం మనం మర్చిపోలేమన్నారు. ఆయన చేసిన పదవుల వలన ఆ పదవులకు వన్నె వచ్చిందని అన్నారు. …

Read More »

పాస్‌పోర్ట్ కావాలంటే దగ్గరలోని పోస్టాఫీస్ సందర్శిస్తే సరిపోతుంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘ఎంఇఎ’ నిర్వహిస్తున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రజల సౌలభ్యం కోసం మరో సౌకర్యం కల్పించారు. పాస్‌పోర్ట్ కోసం సమీప పోస్టాఫీసులలో అప్లై చేసుకునే పద్దతిని ప్రారంభించారు. దీని కోసం మీరు కామన్ సర్వీస్ సెంటర్ లేదా పోస్టాఫీసు CSS కౌంటర్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్వీట్ …

Read More »

హార్టికల్చర్, అగ్రి ఇన్‌ఫ్రా మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ, అనుబంధ శాఖలు (హార్టికల్చర్, అగ్రి ఇన్‌ఫ్రా), పశుసంవర్ధకశాఖలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు.  ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాటి బలోపేతంపై చేపడుతున్న కీలక ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండోదశ పనులకు సిద్ధం కావాలని, ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తి కావాలి, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసారు.  మల్టీపర్పస్‌ సెంటర్లు, కమ్యూనిటీ …

Read More »

ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మంజూరైన 7 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.నూతనంగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల పై హైలెవల్ కమిటీ సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శంఖు స్థాపన చేసిన నేపథ్యంలో ఇప్పటికే మొదటిదశ కింద చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల …

Read More »