Breaking News

Tag Archives: delhi

ఏపీలో కొత్త వైద్య క‌ళాశాల‌ల నిర్మాణానికి స‌హ‌క‌రించండి

-సీఎం వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పం ఎంతో గొప్ప‌ది -కేంద్ర స‌హ‌కారం కూడా తోడైతే మ‌రిన్ని అద్భుతాలు -కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని విన‌తి -సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా నిర్మిస్తున్న మెడిక‌ల్ క‌ళాశాల‌లకు కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం కూడా కావాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ‌ను కోరారు. న్యూఢిల్లీలోని …

Read More »

ఏపీలో 16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు

-ఆరోగ్య‌శ్రీ కింద 50 శాతం ప‌డ‌క‌లు కేటాయించేలా ఒప్పందం -ప్ర‌పంచ‌స్థాయి ఆస్ప‌త్రుల ఏర్పాటుకు ఆహ్వానం -పెట్టుబ‌డులకు ఏపీ ప్ర‌భుత్వం ఎంతో అనుకూలం -పెట్ట‌బడులు పెట్టేవారికి ఫోన్ కాల్ దూరంలో ప్ర‌భుత్వం -వైద్య ఆరోగ్య రంగ స్వ‌రూపాన్ని సీఎం జ‌గ‌న్ మార్చేస్తున్నారు -రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని -ప్ర‌తిష్టాత్మ‌క ప్రైవేటు ఆస్ప‌త్రుల య‌జ‌మానుల‌తో మంత్రి భేటీ -సీఐఐ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో స‌మావేశం న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్‌ల ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రివ‌ర్యులు …

Read More »

హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా నుండి న్యూ ఢిల్లీ కి వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఊనా లోని అంబ్ అందౌరా నుండి న్యూ ఢిల్లీ కి వెళ్లే కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభిక ప్రయాణాని కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న ఆకుపచ్చటి జెండా ను చూపెట్టడం ద్వారా ఆ రైలు ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పెట్టెల ను పరిశీలించి, ఆ రైలు లో సదుపాయాలను గమనించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు …

Read More »

తిరుపతిలోని లిథియం బ్యాట‌రీ తయారీ కర్మాగారాన్ని రేపు సందర్శించనున్న కేంద్ర స‌హాయ మంత్రి చంద్రశేఖర్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజా వార్త : కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ స‌హాయ‌ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశపు మొట్టమొదటి లిథియం బ్యాట‌రీ తయారీ కేంద్రం ప్రీ-ప్రొడక్షన్ రన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో రేపు సందర్శించనున్నారు. ఈ అత్యాధునిక త‌యారీ కేంద్రాన్ని చెన్నైకి చెందిన మునోథ్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.165 కోట్లతో ఏర్పాటు చేసింది. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుప‌తిలో ప్రారంభించిన‌ రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లలో ఇది ఒక‌టి. ఈ త‌యారీ కేంద్రం 270 మెగావాట్ల ల‌క్ష్యంతో …

Read More »

“అందరికీ ఆరోగ్యాన్ని” అందించడంలో ప్రభుత్వం “సమగ్ర విధానాన్ని” తీసుకుంటోంది : డాక్టర్ మన్సుఖ్ మాండవియా

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజా వార్త : “వ్యాధుల నివారణ, నియంత్రణ, నిర్వహణలో వ్యాధులపై నిఘా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దిశగా NCDC-ప్రాంతీయ శాఖలు కీలకమైన భూమిక నిర్వహిస్తాయి. అవి సత్వర నిఘా, త్వరితగతిన గుర్తించడం వంటి వ్యాధుల పర్యవేక్షణతో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి, తద్వారా ముందస్తు ప్రయత్నాలను ప్రారంభిస్తాయి. ఆరు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, త్రిపుర ఉత్తర ప్రదేశ్) నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) శాఖలకు శంకుస్థాపన చేస్తూ కేంద్ర ఆరోగ్య …

Read More »

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా సాగింది. సోమ‌వారం ఉద‌యం నుంచి ఆయ‌న ప‌లు స‌మ‌యాల్లో ప్ర‌ధాని మోదీతో పాటు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సమావేశమైన సీఎం. పోలవరం, రీసోర్స్‌ గ్యాప్ కింద నిధులు, జాతీయ ఆహార భద్రతాచట్టం కింద అర్హుల …

Read More »

స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం: జి. కిషన్ రెడ్డి

-బ్రిటీషర్లకు ముప్పుతిప్పలు పెట్టిన తెలుగు వారందరినీ గుర్తుచేసుకోవాల్సిన తరుణమిది -కొందరు నేరుగా ఆంగ్లేయులను ఎదుర్కొంటే మరికొందరు వారి సాహిత్యంతో ప్రజలను చైతన్య పరిచారు -తెలుగువాళ్లు ఎక్కడున్నా మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, దేశ సమగ్రతను కాపాడేందుకు పాటుపడుతుండటం అభినందనీయం -ఆంధ్ర అసోసియేషన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రసంగించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరోమంది వీరులు, వీర వనితలు ఆత్మత్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి …

Read More »

జాతీయ ప్రయోజనాలే పరమావధి

– ఎంపీలు, దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఉద్బోధ – ఘనంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం – ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ సహా హాజరైన కేంద్ర మంత్రులు, విపక్ష పార్టీ నేతలు, ఉభయసభల ఎంపీలు – ఉపరాష్ట్రపతితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని నెమరువేసుకున్న ప్రధాని, ప్రజలతో నిరంతరం అనుసంధానమైన నాయకుడు వెంకయ్యనాయుడు అని ప్రశంస – వివక్షరహిత సమాజ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఉపరాష్ట్రపతి పిలుపు – ఐదేళ్లుగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ బాధ్యతలు సంతృప్తినిచ్చాయని వెల్లడి …

Read More »

నెల్లూరు, ప్రకాశం జిల్లాల క్షేత్ర ప్రచార అధికారిగా పరవస్తు నాగసాయి సూరి

-కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో నెల్లూరు కేంద్రంగా కార్యకలాపాలు -భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియా అధికారిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న సూరి న్యూఢిల్లీ మరియు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం), నెల్లూరు క్షేత్ర కార్యాలయ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ (క్షేత్ర ప్రచార అధికారి)గా పరవస్తు నాగసాయి సూరిని నియమిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ …

Read More »

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన చంద్రబాబు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీలు శ‌నివారం దిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ప‌య్యావుల కేశవ్, సంధ్యారాణి, కంభంపాటి రామ్మోహన్, శ్రీనివాస్‍రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »