Breaking News

Tag Archives: hyderabad

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కలిసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

హైదరాబాదు, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నేడు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తుఫాను సహాయక చర్యలను అభినందించారు.

Read More »

పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు

-ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డుగా నమోదు -ఉప ముఖ్యమంత్రి  పవన్ కల్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధిచే రికార్డు పత్రం ప్రదానం హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

వరద బాధితుల కోసం పలువురు విరాళాలు అందజేత

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో ఆదివారం కలిసి సీఎం సహాయ నిధికి చెక్కులు అందించారు. వీరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. విరాళాలు అందించిన వారిలో…. 1. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్లు. 2. కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షలు 3. చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరపున చల్లా అజిత …

Read More »

తెలంగాణ వరదల సహాయక చర్యల నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కోటి విరాళం

హైదారాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేశారు. అనంతరం వారి భేటీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రకృతి విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు …

Read More »

హైడ్రా కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు నష్టపరిహారం చెల్లించాలి…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైడ్రా కూల్చి వేతల్లో ఇళ్లు కొల్పోయిన పేదలకు ప్రభుత్వం పునర వాసం కల్పించి, నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో నగరంలో చెరువులు, నలాలను కబ్జా చేసిన అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని చెప్పారు. హైడ్రాను తమ పార్టీ స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతు …

Read More »

అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన సెల్ కాన్ సీఎండీ వై.గురు

-తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకు విరాళంగా అందజేత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అన్నక్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు రూ.26.25 లక్షలను అన్నక్యాంటీన్లకు విరాళంగా అందించారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నక్యాంటీన్లలో …

Read More »

తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నదే నా తపన – తెలంగాణాలో ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం : సీఎం చంద్రబాబు

-ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు -హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు -తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు -తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చించినట్లు తెలుస్తోంది హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : 2047 కల్లా ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో …

Read More »

గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో …

Read More »

ప్ర‌జా భ‌వ‌న్‌లో బోనాల సంబురాలు…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ‌ మాసం సందర్భంగా ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహిసున్నారు. అయితే.. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం సమర్పించుకున్నారు. అనంతరం ప్రజా భవన్ నుంచి.. అబ్దుల్లాపూర్ మెట్‌కు సీఎం రేవంత్ బయలుదేరి వెళ్లారు. కాటమయ్య రక్ష …

Read More »

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఈ రోజు సందర్శించారు. ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారంలోని కీలక ఉత్పత్తి యూనిట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత, ఆర్‌ఐఎన్‌ఎల్‌ సీనియర్‌ మేనేజర్లతో వివరణాత్మక చర్చలు జరిపారు, కర్మాగారం పనితీరును సమీక్షించారు. ఈ పరిశీలన అనంతరం కార్మికులతోనూ మంత్రి మాట్లాడారు. …

Read More »