తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 3 సం. ప్రజా సంక్షేమ పాలన పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని స్వామి వారు, అమ్మవార్ల దీవెనలతో మరింతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా చూడాలని …
Read More »Tag Archives: tirumala
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా రేపు విడుదల…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళపాద పద్మారాధన సేవ టికెట్లను రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మే …
Read More »నవీ మంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమి పత్రాలను టీటీడీకి అందించిన మహారాష్ట్ర మంత్రి
-ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన రేమండ్ సంస్థ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే టీటీడీకి భూమి పత్రాలను అందజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ఉదయం బోర్డు మీటింగ్ ప్రారంభానికి ముందు చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో మహారాష్ట్ర మంత్రి పత్రాలను …
Read More »తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు…
తిరుమల, తిరుమల తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. 2019 ఏప్రిల్‌లో టీటీడీ ఆలయం వెనుక భాగంలోని వసంతమండపంలో ఈ ఉత్సవాలు నిర్వహించిన టీటీడీ ఆ తర్వాత కొవిడ్ కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. కొవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఈసారి వసంతమండపంలోనే భక్తుల మధ్య ఈ ఉత్సవాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సాధారణంగా ఏటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై పూర్ణమికి ముగిసేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. వసంతోత్సవాలను నిర్వహించే …
Read More »శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ సీఎం జయ రామ్ తాకూర్…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల బుధవారం ఉదయం నైవేద్య విరామం అనంతరం శ్రీవారిని హిమాచల్ సీఎం జయ రామ్ తాకూర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదఆశీర్వచనం చేపించి అనంతరం స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తి.తి.దె చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి తో ,తిరుపతి ఎం.పి మద్దిల గురుమూర్తి, దేవదాయ-ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Read More »శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి సాదరంగా స్వాగతం పలికారు. అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో దేవాలయంలోకి తోడ్కొని వెళ్లారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ హరిచందన్ కు వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు …
Read More »తిరుమలలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఇవాళ రథసప్తమి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చాడు. కొవిడ్ నిబంధనల మేరకు వాహన సేవలను తితిదే ఏకాంతంగా నిర్వహించనుంది. సూర్యప్రభ వాహనంతో మొదలైన ఒక్కరోజు బ్రహ్మోత్సవాలు రాత్రి చంద్రప్రభ వాహనంతో ముగియనున్నాయి. ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రథసప్తమి మహోత్సవంలో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై …
Read More »నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన వారిపై కేసు…
-డ్రైవర్లు మోసం చేస్తే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఆటోడ్రైవర్‌తోపాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్నపాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియన్, అతని స్నేహితులను కలిపి ముగ్గురిని విచారించారు. తిరుపతిలో ఆటో …
Read More »వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైష్ణవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీతో కనిపించాయి. వేంకటేశ్వరుడిని భక్తులు ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకుని తరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు …
Read More »ఘాట్ రోడ్లలో వాహనాల వేగనియంత్రణ చర్యలు
-ఘాట్ రోడ్డు, శ్రీవారిమెట్టు మార్గాల మరమ్మతులు త్వరలో పూర్తి చేయాలి -టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణ కోసం వాహనాల వేగనియంత్రణ కోసం స్పీడ్ గన్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత వేగం నిబంధనను ఉల్లంఘించే వాహనాలను స్పీడ్ గన్‌ల ద్వారా గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం అధికారులతో ఆయన వర్చువల్ పద్ధతిలో సమావేశం …
Read More »
Prajavartha Online Telugu News