తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.
Read More »Tag Archives: tirumala
తిరుమలలో కొత్త PAC-5 సముదాయం ఆవిష్కరణకు సిద్ధం
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్తగా నిర్మించిన PAC-5 సముదాయాన్ని ప్రారంభించనున్నారు. వెంకటాద్రి నిలయం పేరుతో నిర్మించిన ఈ ఉచిత యాత్రికుల సముదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం రూ.102 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఐదు అంతస్తుల ఈ భవనం తుది దశలో ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం 2018లో జరిగిన TTD బోర్డు సమావేశంలో తీసుకున్నారు. సౌకర్యాలు: -2,500 మంది యాత్రికులకు ఉచిత వసతి -216 మరుగుదొడ్లు, 216 స్నానాల గదులు -2 …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఒడిశా గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వి ఐ పీ విరామ సమయంలో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం తో టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు.
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) అధికారులు మరియు అర్చకులు గౌరవ రాజ్యపాలుడిని స్వాగతించారు. అనంతరం రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ సి.హెచ్. వెంకయ్యచౌదరి, టిటిడి ఓఎస్‌డి ఎం.ఎస్. నాయక్ మరియు ఇతర అధికారులు గౌరవంగా గవర్నర్ కి శ్రీవారి వస్త్రాలు అందజేశారు. అనంతరం …
Read More »వెంకన్నకు భారీ బంగారు కానుక
-రూ. 2.40 కోట్ల విలువగల శంఖు, చక్రాల వితరణ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల వెంకన్నకు మంగళవారం రెండన్నర కిలోల భారీ బంగారు కానుక అందింది. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను …
Read More »తిరుమలలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన నిడదవోలు వాసులు
-తిరుమల శ్రీవారి సేవలో నిడదవోలు సేవకులు విశేష సేవలు అందిస్తున్నారని అభినందన -మూలవిరాట్ కు నిర్వహించే ప్రసిద్ధమైన అర్చనసేవలో పాల్గొన్న అనంతరం తిరుమలలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించిన మంత్రి దుర్గేష్ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో పర్యటిస్తున్నపర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను శ్రీవారి సేవ నిమిత్తం తిరుమలకు వచ్చిన నిడదవోలుకు చెందిన ఓ మహిళా బృందం కలిసింది. ఈ సందర్భంగా తిరుమలలో తోటి యాత్రికులకు నిస్వార్థంగా ఉచిత సేవను అందిస్తూ అధ్యాత్మిక భావంలో మునిగితేలుతున్న నిడదవోలుకు …
Read More »తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సోమవారం తెల్లవారుఝామున తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వైకుంఠ శ్రీనివాసుడి దివ్య దర్శనం చేసుకోవడం అనిర్వచనీయమైన అనుభూతి …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి ప్రధాన కార్యదర్శి కి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి ప్రధాన కార్యదర్శి కి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read More »తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. అదనపు ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా …
Read More »
Prajavartha Online Telugu News