-రూ. 2.40 కోట్ల విలువగల శంఖు, చక్రాల వితరణ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల వెంకన్నకు మంగళవారం రెండన్నర కిలోల భారీ బంగారు కానుక అందింది. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో దాతలకు అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News