గోసాల, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బంధం వృద్దాశ్రమం” లోని నూతన భవన విస్తరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీనివాసరావు, గోసాల గ్రామ పంచాయితి సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వృద్ధాశ్రమాలు రోజు రోజు కు పెరిగిపోవడం బాధాకారం అని డబ్బు సంపాదించే వ్యామోహంలో తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా, స్వయంగా వారే వృద్ధాశ్రమాలలో చేర్పించడం మనం చూస్తున్నాం అని కాని యువత ఒకసారి పునం పరిశీలించుకోవాలని, వయస్సు పైబడ్డవారికి కావలసింది ప్రేమతో పలకరింపు, కాస్త సమయం వారితో గడపడమేనని ఆయన అన్నారు. అనంతరం వాసవ్య మహిళా మండలి నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం గురించి మాట్లాడుతూ ఇక్కడున్న మామ్మలు బొమ్మలు లా ఉన్నారని, బామ్మలను చూస్తే తెలుస్తుంది వీరు ఎంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారని, గతం లో వీరి జీవితంలో జరిగిన బాధలను మరచి జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. వాసవ్య వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.
అనంతరం వాసవ్య మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ తొలుత ఈ వృద్ధాశ్రమం అనేక మంది దాతల ద్వారా నిర్వహించామని ఇప్పుడు యస్.బి.ఐ పౌండేషన్ సహకారంతో 1.5 కోట్లతో భవన ఆధునికీకరణ జరిగిందని ఇప్పుడు మామ్మలు ఎంతో సౌకర్యవంతంగా జీవితాన్ని గడుపుతున్నారని ఆమె అన్నారు. ఇలా సేవలు అందించిన, అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని ఆమె అన్నారు.
అనంతరం డాక్టర్ పి. దీక్ష, వాసవ్య మహిళా మండలి ఉపాధ్యక్షులు మాట్లాడుతూ మామ్మలను వెన్నునొప్పి, ఇతర సమస్యలు లేకుండా సౌకర్యంగా నిద్రపోవడానికి ఒక్కొక్కరికి 40 వేల రూపాయలు ఖర్చు చేసి మంచాలను ఏర్పాటు చేయడమైందని, ఎప్పటికప్పుడు ప్రత్యేక హెల్త్ క్యాంపు ల ద్వారా వీరి ఆరోగ్య పరిరక్షణ చేయడం జరుగుతుందని డాక్టర్ మెరోజ్, డాక్టర్ అభినయ లు దీని బాధ్యతను తీసుకున్నారని ఆమె అన్నారు.
అనంతరం సంస్థ కార్యదర్శి జి.రశ్మి మాట్లాడుతూ వాసవ్య మహిళా మండలి ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని దీనికి సహకారాన్ని చేయూతను అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ సరస్వతి అయ్యంగార్, టి.సుభాషిని, విజయ మరియు వాసవ్య మహిళా మండలి కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News