విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం సంబందించి రామలింగేశ్వర నగర్ క్లస్టర్ 15, 17 డివిజన్లు, ఆటోనగర్ క్లస్టర్ 11వ డివిజన్, పటమట క్లస్టర్ 12వ డివిజన్ స్థాయిలో ‘బాబు ష్యురీటి మోసం గ్యారంటీ’ రికాలింగ్ చంద్రబాబు’స్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని స్థానిక డివిజన్ నాయకులు ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని దివంగత మహానేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి, QR కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వ చేసిన మోసాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గుర్తుకు తెస్తూ హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఏరకంగా మోసం చేశాడు. ప్రజలందరూ కూడా ఏ రకంగా నష్టపోయారు అనే విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ యొక్క సమావేశంలో అందరికీ తెలియజేయడం జరిగింది అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్ని అమలు చేస్తాం అని చెప్పి .. ఈ రోజు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని పెట్టి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఉన్న పథకాలను పేర్లు మార్చి ప్రజలను పిచ్చోళ్ళని చేసిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాగం అని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వైస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. రాబయో రోజుల్లో ఎవరిని వదిలేప్పెటది లేదు వచ్చేది మన వైస్సార్సీపీ ప్రభుత్వం మీ అని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ అక్రమ కేసుల్లో జైలుపాలైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి పోలీసుల ఆంక్షల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. వైయస్ జగన్‌ని రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వైయస్ జగన్ పర్యటను ఆపలేపకపోయాయిరు.జగన్ కోసం వచ్చే జన ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారు. రాష్టంలో వైస్సార్సీపీ నాయకులు మీద టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే .. పోలీసులు కనీసం కేసులు కూడా నమోదు చేయట్లేదు. ప్రజా సమస్యల మీద వైయస్ జగన్ బయటకొచ్చి మాట్లాడుతుంటే ఈ కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. ప్రజలు స్వచ్ఛందంగా జగన్ వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నారనేందుకు గతంలో జరిగిన పర్యటనలే నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకే ప్రజలు విసిగి పోయారు.. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నితే..వైస్సార్సీపీ అంత బలపడుతుంది. అధికారం శాశ్వతం కాదు..వచ్చేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ఆయా డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు. మాజీ డిప్యూటీ మేయర్, రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News