Breaking News

Tag Archives: tirumala

శ్రీవారి భక్తులకు శుభవార్త : వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ప్రకటించిన టీటీడీ

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్నాయి. అక్టోబరు 4న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అదే నెల 12న చక్రస్నానంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ మేరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది. కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. అక్టోబరు 4న ధ్వజారోహణంతో …

Read More »

ఆగస్టులో రెండు సార్లు గరుడవాహనంపై విహరించనున్న శ్రీ మలయప్ప స్వామి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 9న గరుడ పంచమి ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి …

Read More »

తిరుమలకు చేరుకున్న మంత్రి కొలుసు పార్థసారథి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి రెండు రోజులు పర్యటనలో భాగంగా శనివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి కి టీటీడీ ఓఎస్డి సత్రా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, డిఈ శ్రీనివాసరావు, ఎఈ లు మహేష్, శ్రీరామ్ రెడ్డి, ప్రోటోకాల్ కృష్ణయ్య తదితరులు పుష్ప గుచ్చాలు …

Read More »

శ్రీవారి భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలి

-ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది మరియు హోటల్‌ యజమానులకు శిక్షణ -పెద్ద మరియు జనతా క్యాంటీన్‌లలో ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం -ప్రతి హోటల్ లో ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి -టీటీడీ ఈవో జె. శ్యామల రావు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి.అనిత

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర రాష్ట్ర హోం శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి.అనిత కుటుంబ సభ్యులుతో కలిసి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్చకులు రంగ నాయక మండపం నందు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More »

జూలై 21న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల, నేటి పత్రిక ప్రజావార్త : గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21న ఆదివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ చేస్తారు విషయం విదితమే.ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

Read More »

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ దంప‌తులు ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, డైరీ, క్యాలెండ‌ర్‌ను జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జేఈఓ వీరబ్రహ్మం, జేఈఓ శ్రీమతి గౌతమి, జెసి ధ్యాన చంద్ర, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్, డెప్యూటీ ఈవోలు శ్రీ …

Read More »

జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది. చారిత్రక నేపథ్యం : సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి …

Read More »

శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా దర్శన, వసతి

-మధ్యవర్తులు, దళారీల బెడద లేకుండా చర్యలు -ఇకపై ఆధార్ తో శ్రీవారి సేవలు కల్పించేందుకు ప్రయత్నాలు : టీటీడీ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

-రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిపై తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా: మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం చేరుకున్న మంత్రివర్యులకు ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం నందు మంత్రివర్యులకు వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను …

Read More »