విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, నగరంలో 18 సంవత్సరాలు పైబడిన అందరూ వ్యాక్సినేషన్ వేయించుకొవాలని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శనివారం నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ సమావేశంలో ఐదుగురు సభ్యుల ఎన్నిక అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు వ్యాక్సిన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలలో 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే శాశ్వత మార్గమని, యువత సహకరించాలని పిలుపునిచ్చారు.
Tags vijayawada