-స్పందనకు రికార్డు స్థాయిలో ఆర్జీల వెల్లువ 134 ఆర్జీల నమోదు..
-ఆర్జీదారుల సమస్యలను ఓపికతో విని పరిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ప్రజలు సమర్పించిన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం ఆర్జీదారుల సమస్యల పరిష్కార దిశగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తూ వారి సమస్యలను ఓపికతో వింటూ వర్చువల్ విధానం ద్వారా సంబంధిత అధికారులతో ప్రత్యక్షంగా సమస్యపై చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించడం ఆర్జీదారుడు బావోద్వేగానికి గురి చేసింది. ఆర్జీదారుడు తన సమస్య పరిష్కారం కోసం స్థానిక కార్యాలయ అధికారుల చూట్టూ అనేక మార్లు తిరిగినప్పటికి పరిష్కారం కాని సమస్య కలెక్టర్ చొరవతో అక్కడిక్కడే పరిష్కారం లభించడం ఆనందానికి గురి చేసింది. సమస్యకు పరిష్కారం లభించడంతో ఆర్జీదారుడు స్పందన మందిరం నుండి బయటకు వచ్చి ఆనందంతో చర్చించుకోవడం విశేషం. తమ సమస్యలకు స్పందనే సరైన మార్గమని ఓర్పు, సహనం, ప్రజల పట్ల ఆధరాభిమానాలు కలిగిన కలెక్టర్‌గా నూతన ఎన్‌టిఆర్ జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా ఉండటం ప్రజల అదృష్టం మని ఆర్జీదారులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్పందనలో స్వీకరించిన ఆర్జీలపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి స్పందన ఎకైక మార్గమని ఎంతో మంది ఆర్జీదారులు ఆశతో స్పందనలో తమ సమస్యలకు సంబంధించిన ఆర్జీలను అందజేస్తున్నారన్నారు. వాటిని నిశితంగా పరిశీలించి పరిష్కరించాల్సిన భాధ్యత మనపై ఉందన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యకు సరైన పరిష్కారం చూపగలిగిన్నపుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. సమస్యను పరిష్కరించాలనే ఆలోచన పట్టుదలను అచరణలో పెడితే పరిష్కార మార్గాలులభిస్తాయన్నారు. ఈ దశగా ప్రతి అధికారి ఆలోచించి తమ భాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులకు సూచించారు.స్పందన కార్యక్రమంలో 134 అర్జీల నమోదు అయ్యాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ 53, పోలీస్ 20 యంఏయుడి 7, పోలీస్ 20, ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్ 12, హెల్త్ 6, పంచాయతీరాజ్ 4, హౌసింగ్ 3, ఉపాధి కల్పన 3,కాగా మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి 26గా ఉన్నాయని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, ఆర్‌డివో కె.మోహన్‌కుమార్, డిపివో జె.సునీత, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు రామలక్ష్మి, భాను, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News