Breaking News

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి అమ‌లుపై ప్ర‌త్యేక దృష్టి

– జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమ‌లుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ క‌మార్ మీనా.. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌రపాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. నిష్ప‌క్ష‌పాత‌, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ముఖేష్ కుమార్ మీనా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) ప‌టిష్ట అమ‌లుకు తీసుకున్న చ‌ర్య‌ల‌పై స‌మీక్షించారు. బోర్డ‌ర్ చెక్‌పోస్టుల వ‌ద్ద ప‌ర్య‌వేక్ష‌ణ‌, క్షేత్ర‌స్థాయిలో ఫ్ల‌యింగ్ స్వ్కాడ్‌ల ప‌నితీరు, సీజర్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌స్థ విస్తృత స్థాయిలో వినియోగించడం, సీ విజిల్, ఇత‌ర మార్గాల ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం త‌దిత‌రాల‌పై సూచ‌న‌లిచ్చారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు స‌ర‌ళి, ఫిర్యాదుల ప‌రిష్కారం, నివేదిక‌ల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ త‌దిత‌రాల‌ను వివ‌రించారు. స‌‌మావేశంలో ఎన్నిక‌ల సెల్ సూప‌రింటెండెంట్ ఎం.దుర్గాప్ర‌సాద్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సైన్యాధ్యక్షుడికి మద్దతుగా… తరలి వచ్చిన వేల మంది సైన్యం…

-విద్యాసాగర్, డి.వి. రమణ -నామినేషన్ల మహోత్సవ సంబరం… -వెల్లువెత్తిన అభిమాన జనసంద్రం… -భారీ ఊరేగింపుతో…ఉద్యోగుల ఆనందోత్సాహాలు… విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *