Breaking News

గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కంకిపాడు మండల పరిధిలోని మారేడుమాక, మంతెన గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ కి ఆయా గ్రామాల ప్రజలు నుండి విశేషణ ఆదరణ లభించింది. మంత్రి జోగి రమేష్ ని గ్రామలలోని మహిళలు హారతులతో స్వాగతించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయతతో పలకరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంటే మరల ఓటువేసి జగనన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, పెనమలూరు శాసనసభ్యునిగా నన్ను గెలిపించాలంటూ జోగి రమేష్ గ్రామస్తులను కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరించడానికి తాను నిరంతరం సిద్ధంగా ఉంటానని గ్రామస్తులకు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగిందనుకుంటేనే మరల ఇప్పుడు మరోసారి ఓటువేసి గెలిపించండి అంటూ జోగి రమేష్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మారేడుమాక గ్రామ సర్పంచ్ చోరగుడి ఆదర్శ కుమార్ మంతెన గ్రామ సర్పంచ్ వీరంకి వెంకటరమణ, వైసిపి రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి కొండవీటి వెంకట సుబ్బారావు, యూత్ నాయకులు రాజులపాటి శివబ్రమేశ్వర, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

ఒంటి చేత్తో పది పనులు చక్కబెట్టే శక్తి ఒక్క మహిళలకే సాధ్యం

-మహిళలు డబ్బు కోసం దేహీ అనకూడదు -ఆడవాళ్లు ఎందులోనూ మగవారితో తీసిపోరు -స్త్రీలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతాలు సృష్టిస్తారు -మహిళల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *