Breaking News

11న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బిహార్‌ నుంచి ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఝార్ఖండ్‌ నుంచి ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. ‘ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు శుక్రవారాల్లో కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. రాయలసీమ, కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయి’ అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.

Check Also

జిల్లాలో నేడు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వచ్చిన అర్జీలు: 947

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *