విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మ్యారీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సంజా ఉత్సవ్ ఎస్ హెచ్ జి మేళా 2024 లో ఆదివారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ విజయవాడలో 100కు పైగా స్వయం సహాయక బృందాలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకాలు చేస్తున్న శుభ సందర్భంలో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అతి తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు దొరుకుతున్నాయని, ప్రజలు దీని వినియోగించుకోవడం ద్వారా వారికి నాణ్యమైన వస్తువులు దొరకడమే కాకుండా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలపరిచేందుకు ఓ మంచి అవకాశం కలుగుతుందని తెలిపారు. డిసెంబర్ 30, 2024 నా ముగిసే ఈ మేళాలను అందరూ కచ్చితంగా సందర్శించాలని కోరారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి ఆకర్షించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల కోసం కిడ్స్ ప్లే మరియు షాపింగ్ కొరకు విచ్చేసే వారి కోసం ఎగ్జిబిషన్ కం సేల్ అందుబాటులో ఉందని దీని అందరూ సద్వినియోగించుకోవాలని కోరారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …