విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీపీఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో వాంబే కాలనీ వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులందరికి కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 60వ డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ హాజరై సీపీఐ వారు చేస్తున్న కరోనా సేవా కార్యక్రమాలను కొనియాడి అభినందించారు. నగర కార్యవర్గ సభ్యుడు కె.వి.భాస్కరరావు మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలనే దృక్పధంతో అందరికి మందు ఇవ్వడం జరిగిందని, అందరూ బాగుంటే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని, ఉచితంగా అందచేస్తున్న ఆనందయ్య కి పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ కార్యదర్శి కె.రామరాజు మరియు కంచి ధనశేఖర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …