Breaking News

వృద్దాశ్రమాలకు ఆనందయ్య మందు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీపీఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో వాంబే కాలనీ వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులందరికి కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 60వ డివిజన్ కార్పొరేటర్  కంచి దుర్గ హాజరై సీపీఐ వారు చేస్తున్న కరోనా సేవా కార్యక్రమాలను కొనియాడి అభినందించారు. నగర కార్యవర్గ సభ్యుడు కె.వి.భాస్కరరావు మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలనే దృక్పధంతో అందరికి మందు ఇవ్వడం జరిగిందని, అందరూ బాగుంటే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని, ఉచితంగా అందచేస్తున్న ఆనందయ్య కి పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ కార్యదర్శి కె.రామరాజు మరియు కంచి ధనశేఖర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *