విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో శాకంబరీ దేవి గా మూడవ రోజు భక్తులకు శనివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ గా దర్శనం ఇచ్చారని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరు పిళ్ళా హనుమంతరావు, కొర్ర గంజి భాస్కర్ రావు లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే శాకంబరీ దేవి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని మరి ఈరోజు గురుపౌర్ణమి కావడంతో భక్తులు వేకువ జాము నుండే పెద్ద మొత్తంలో వచ్చారని ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి భక్తులు మాస్కులు ధరించి సమదూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నుదురుమాటి కృష్ణ ప్రసాద్ శర్మ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష
-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యాక్రమాల అమలు చైర్మన్, కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా …