Breaking News
????????????????????????????????????

ఎపిడిఆర్పి ప్రాజెక్టు పనులన్నీ డిశంబరులోగా యుధ్ధ ప్రాతి పదికన పూర్తి చేయండి : సిఎస్.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ (ఎపిడిఆర్పి) కు సంబంధించి 4వ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ  సమావేశం సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ ఎపి డిఆర్పి ప్రాజెక్టు కింద చేపట్టిన పనులన్నిటినీ యుధ్ధ ప్రాతిపదికన చేపట్టి ఈఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు.ప్రపంచ బ్యాంకు సహాయం, మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కలిపి సుమారు 1773కోట్ల రూ.ల అంచనాలతో శ్రీకాకుళం నుండి తూర్పు గోదావరి జిల్లా వరకు చేపట్టిన ఎపి డిఆర్పి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు. వాస్తవానికి ఈపనులన్నీ 2015-2020 ల మధ్య ఐదేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉందని అయితే కరోనా తదితర కారణాల వల్ల పనులు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు.దానివల్ల ఈప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఈఏడాది వరకూ గడువును పెంచినందున ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు లోగా పనులన్నీ పూర్తి కావాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండాలోని అంశాలను వివరించారు. ఇప్పటి వరకూ 1452 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 73శాతం ఫిజికల్ ప్రోగ్రస్ ను,71శాతం ఫైనాన్సియల్ ప్రోగ్రస్ ను సాధించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక, టిఆర్అండ్బి శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్,యంటి కృష్ణ బాబు, ఎపి డిఆర్పి ప్రాజెక్టు డైరెక్టర్ కె.కన్నబాబు,అటవీ,ఎపి ట్రాన్సుకో ఇతర విభాగాల అధికారులు, వీడియో సమావేశం ద్వారా జివియంసి కమీషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *