విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ని ఆయన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసిన దేవినేని అవినాష్ పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలలో తిరుగుతున్న అవినాష్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను గురుంచి కమిషనర్ తో చర్చించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరగా,సానుకూలంగా స్పందించిన ఆయన వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పర్యటించి వీలైనంత త్వరగా పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముసునూరి సుబ్బారావు, కార్పొరేటర్లు ప్రవల్లిక, రెహనా, కనక దుర్గ కాలనీ ప్రెసిడెంట్ నారాయణ, పాతురి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …