విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క పేదవారికి అన్యాయం జరగకూడదు అని,వారికి సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయి కి ఎదిగేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం స్థానిక 16 వ డివిజిన్లో కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక గారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పధకాలు అందాలి అని సచివాలయ వ్యవస్థ, వాలంటర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ దే అని,అసలైన పేదల పక్షపాతి ఆయన అని కొనియాడారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు కేవలం వారి రాజకీయ మనుగడ కోసమే ఆస్తిపన్ను పెంచుతున్నారని అసత్యాలు ప్రచారం చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు ఆని,ప్రభుత్వానికి పేదలను ఇబ్బంది పెట్టే ఉదేశ్యం లేదని ఆ విధంగానే ఆస్తిపన్ను విధానం రూపకల్పన చేసారని చెప్పారు.16 వ డివిజిన్లో సీనియర్ నాయకులు గా బహుదూర్ గారికి ప్రజా సమస్యల పట్ల విశేష అనుభవం ఉందని, ఏ నమ్మకం తో అయితే ప్రజలు వైసీపీ నాయకుల ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధముగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ,వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన ఇళ్ళు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఉచితంగా ఇళ్ళను ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎవరు ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దు అని భరోసా ఇచ్చారు.ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ డివిజన్ ని దత్తత తీసుకున్న అని షో చేసి డివిజన్ అభివృద్ధి ని మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలు పరిష్కరానికి ప్రభుత్వం నికి సహకరించాలని హితవు పలికారు.మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం దిశ ఆప్ రూపకల్పన చేసి దాని వినియోగం గురించి పెద్దఎత్తున అవగాహన కార్యక్రమలు చేపడుతున్నారని,ప్రతి మహిళ వారి ఫోన్ లో దిశ ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలని,ఆపద సమయంలో ఒక్క బటన్ తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ కల్పిస్తారని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి,నాగవంశ డైరక్టర్ ఎర్నేటి సుజాత, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, కార్పొరేటర్లు నిర్మలాకుమారి, బిమిశెట్టి ప్రవళ్ళిక,చింతల సాంబయ్య,రెహానా నాహిద్,పుప్పాల కుమారి,వైసీపీ నాయకులు గల్లా రవి,ఉకోటి రమేష్, బచ్చు మాదవి,కావటి దామోదర్,కోటంరాజు, బొచ్చు మురళి, సొంగా రాజ్ కమల్, చిన్నబాబు,బిమిశెట్టి బాబు, తదితరులు పాల్గొన్నారు.
