మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది ఇప్లో పెరుగుతున్నందున ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం నాగార్జున సాగర్ నుండి 5 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నందున బందరు డివిజను పరిధిలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు బందరు ఆర్ డివో ఎన్ఎస్ కె. ఖాజావలి తెలిపారు. శనివారం తాసిల్దార్లు, రెవిన్యూ, పోలీసు అధికారులతో ఆర్ డివో టెలికాన్ఫరెన్సు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, మచిలీపట్నం మండలాల్లో సముద్ర నదితీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో టాంటాం వేయించి తెలియజేయాలని, మత్స్యకారులు సముద్రంలోకి, నదిలోకి రెండు రోజులపాటు చేపలవేటకు వెళ్లరాదని, వారికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ బోట్లు, గజఈతగాళ్లను సిద్ధం చేయలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని, సహాయ పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు గుర్తించాలని అన్నారు. ఆయా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు గావించి సిబ్బందికి విధులు కేటాయించాలని ఎప్పటికప్పుడు వరద పరిస్థితి పరిశీలించి అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని పిహెచ్ సిలలో పాముకాటు మందు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు, పారిశుద్యం పై దృష్టి సారించాలన్నారు. –
Tags machilipatnam
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …