గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వలివర్తిపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీనాగ బంగారమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శుక్రవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగ్నిక బ్రహ్మ శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు మంత్రి కొడాలి నానిని శేషవస్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వందేళ్ళ పూర్వం నుండి శ్రీనాగ బంగారమ్మ తల్లి అమ్మవారు భక్తులచే పూజలను అందుకుంటున్నారని చెప్పారు. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ గావించి , నూతన ఆలయ, విగ్రహ ప్రతిష్ఠా మహెూత్సవాలను నిర్వహించారని చెప్పారు. తొమ్మిది శుక్రవారాల పాటు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలను అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసమని చెప్పారు. ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ ధర్మకర్తలు కోనా ఆదినారాయణ, కోనా మోహన్ బంగారు బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags gudivada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …