-దసరా వేడుకల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం అభినందనీయం
-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్లు ఏపీనీ ఆనంద ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. భవానిపురం పున్నమి ఘాట్ లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ కు ఆదివారం రాత్రి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దసరా వేడుకల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ పేరిట పెద్ద ఎత్తున సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద భరిత కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామం అని, ఈ ఉత్సవానికి శ్రీకారం ఎంపీ కేశినేని శివనాథ్ కు అభినందనలు తెలియజేస్తున్నాము అని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఆలోచనలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ ను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ విజయవాడ నగరానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని సూచించారు.
ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో చేపట్టిన విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ సహకారంతో విజయవాడ ఉత్సవ్ ను ప్రతి ఏటా నిర్వహిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
ప్రముఖ శాస్త్రవేత్త, డిఫెన్స్ ఎండ్ సైన్స్ ప్రభుత్వ సలహాదారుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో విజయవాడ పరిసర ప్రాంతాల్లో డిఫెన్స్ కు సంబంధించి పెద్ద ఎత్తున పరిశ్రమ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను స్వయంగా తిలకించే అవకాశం లభించడం అదృష్టంగా భావించినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ ఉత్సవాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో మలుమూలల నుంచి తరలివచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాలను ఆస్వాదిస్తున్నారని ఆయన తెలిపారు.
ఏపీ పొల్యూషన్ కమిషన్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ విజయవాడతో తనకు నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉందని, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ధృవీకరణ పత్రం తో సంతకం అందజేసినట్లు చేసినట్లు తెలిపారు. యనమలకుదురు శివాలయం సమీపంలో భవాని ద్వీపం తరహాలో శివాని ద్వీపంగా అభివృద్ధి చేస్తే నగరానికి మంచి ఆకర్షంగా ఉంటుందని ఆయన సూచించారు.
మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ వేదికలపై ఎంపీ కేశినేని శివనాథ్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత ముందుకు పోతుందని పేర్కొన్నారు.
తుని ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ వంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులోనూ చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తను పాల్గొని అవకాశం కలగటం సంతోషంగా ఉందన్నారు.
స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారని తెలిపారు. నిర్వాహకులను అభినందించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ప్రకటించారని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News