-ఆలయం వద్ద స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ శంభాజీ షిండే కుమారుడు, కళ్యాణ్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శ్రీకాంత్ షిండే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆయనకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఇద్దరూ కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వాదం అందించి, అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. దర్శనం అనంతరం శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఈ పవిత్ర క్షేత్రానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. దుర్గమ్మ ఆశీస్సులతో దేశం అభివృద్ధి చెందాలి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి” అని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News