విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆర్థిక స్వాలంబనే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని,అందులో భాగంగా కృష్ణా జిల్లా సహకార బ్యాంకు వారు డ్వాక్రా మహిళలకు, చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకొంటూ వ్యాపాఅభివృద్ధి చేసుకోవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం పటమట మోహన్ దాస్ కాంప్లెక్స్ నందు బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కేడీసిసి బ్యాంక్ ఋణమేళ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు 2కోట్ల 37లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వైయస్సార్ ఆసరా,చేయూత లాంటి పధకాలు పెట్టి జగన్ గారు మహిళలకు పెద్దపీట వేశారని,రోజు వారీ వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారం చేసుకొనే చిరు వ్యాపారుల కష్టాలను అర్థం చేసుకొని జగనన్న తోడు పధకం ద్వారా వారికి వడ్డీలేని రుణాలను అందజేస్తున్నారని అది నిరుపేదల పట్ల మా ప్రభుత్వ చిత్తశుద్ధి కి నిదర్శనం అన్నారు. గ్రామీణ బ్యాంక్ ద్వారా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా కృషి చేస్తున్న చైర్మన్, ఇతర బ్యాంక్ సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నగర పార్టీ అధ్యక్షులు బొప్పన భవ కుమార్, కేడీసీ డైరెక్టర్లు రాంబాబు, సుజాత, సీఈఓ శ్యామ్ ప్రసాద్, పటమట,రామవరప్పాడు బ్రాంచ్ మేనేజర్లు రాంబాబు,స్వాతి, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, వైసీపీ నాయకులు అల్లా చల్లారావు, NSU రాజు, మాగంటి నవీన్,ఉకోటి రమేష్, ధనికుల కాళేశ్వర రావు,కోలా ఉమా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …