Breaking News

విజ‌య‌వాడ ప్రగతి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతోనే సాధ్యం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న సీఎం జ‌గ‌న్మోహన్ రెడ్డి
-సన్ సిటీ కాలనీలో రూ. 19 లక్షల విలువైన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ లోని సన్ సిటీ కాలనీలో రూ. 19.06 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు గారు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆశించిన స్థాయిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గత తెలుగుదేశం పాలనలో నగరం పూర్తి నిర్లక్ష్యానికి గురైందన్నారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలోనూ ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడమైనదని వెల్లడించారు. 14వ , 15 వ ఆర్థిక సంఘం నిధులతో పాటుగా ముఖ్యమంత్రి నిధుల నుంచి కూడా నగర అభివృద్ధికి విశేషంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఒక్క 58వ డివిజన్ లోనే ఈ రెండేళ్లలో రూ. 8.50 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా.. రూ. 4 కోట్ల పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. మరో రూ. 4.50 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

వార్డు సచివాలయాల సందర్శన…
సంక్షేమ క్యాలెండర్ పై ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సన్ సిటీ కాలనీలోని 239, 240, 241 వార్డు సచివాలయాలను డిప్యూటీ మేయర్ అవుతు  శైలజారెడ్డి తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన సేవలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదన్నారు. నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకంపై ఇప్పటినుంచే సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అర్హులైన వారందరికీ పథకంపై అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులను చైతన్యపరచడమే సచివాలయ సిబ్బంది ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, కాలనీవాసులు యోచిత, శ్రీనివాస్, డీఈ గురునాథం, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *