ఇరగవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇరగవరం మండలం కావలిపురం గ్రామ పంచాయతీలో త్వరలో యునిసెఫ్ బృందం పర్యటిస్తారని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా రిసోర్స్ పర్సన్ బి.యస్.యస్.యస్. కృష్ణ మోహన్ అన్నారు. సదరు యునిసెఫ్ బృందం పర్యటించి కావలిపురం గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఘనవ్యర్దాల నిర్వహణ, గ్రామంలో డ్రెయినేజీ ల పనితీరు, వ్యక్తి గత మరుగుదొడ్ల వినియోగం, కమ్యూనిటీ సెప్టిక్ లిట్రిన్లు నిర్వహణ మొదలగు అంశాలు పరిశీలించనున్నారు. సదరు యునిసెఫ్ బృందం పర్యటన నిమిత్తం సమాయత్తం కావాలని సూచించారు. ప్రభుత్వం అన్ని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల వద్ద అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొనుటకు అవకాశం కల్పించుట జరిగినదని దీనిలో భాగంగా MG NREGS నిధుల తో అన్ని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల వద్ద రిపేర్లు, పెయింటింగ్, వాచ్ మెన్ షెడ్, ట్రై సైకిల్ షెడ్, మరుగుదొడ్డి, కమ్యూనిటీ సోక్ పిట్ లు, నాడెప్ పిట్ లు నిర్మాణం చేసుకొనవచ్చునని డివిజనల్ కో ఆర్డినేటర్ ఎ.నాగరాజు తెలిపారు. విస్తరణాధికారి ఎం. నవీన్ కిరణ్ మాట్లాడుతూ తడిచెత్త, పొడిచెత్త విడివిడిగా సేకరణ చేసి చెత్తరహిత గ్రామం గా తీర్చి దిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమం లో డి.సి.యం.యస్ డైరెక్టర్ పెన్మత్స సుబ్బరాజు, జిల్లా రిసోర్స్ పర్సన్ బి.యస్.యస్. కృష్ణమోహన్, విస్తరణాధికారి ఎం. నవీన్ కిరణ్, డివిజనల్ కోఆర్డినేటర్ ఎ.నాగరాజు, ఫీల్డ్ టెక్నికల్ కో ఆర్డినేటర్ యస్.భూషణం పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …