Breaking News

డెంగీ, మలేరియా కేసులు ప్రభలకుండా అప్రమత్తంగా వుండండి… : కలెక్టర్ జె. నివాస్

-ప్రతీ శుక్రవారం డ్రై డేగా పాటించండి…
-హైజిన్, శానిటేషన్ యాప్ ల నమోదైన పిర్యాదులపై తక్షణమే స్పందించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రభలకుండా చాలా అప్రమత్తంగా వుండాలని వైద్య పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు.
స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం హైజిన్, శానిటేషన్ యాప్ నిర్వహణ, విష జ్వరాల నియంత్రణపై వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ, ఇఓ ఆర్ డిలు తదితరులతో కలెక్టర్ జె. నివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభ్రతలోపించిన ప్రాంతాలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, దోమలు పెరిగే అవతాతలు ఉన్న ప్రాంతాలను శుభ్రపరిచే విషయంపై ప్రజల నుంచి హైజిన్, శానిటేషన్ యాప్లో నమోదైయిన పిర్యాధులను అర్థవంతంగా పరిష్కారించాలన్నారు. జిల్లాలో ఈ విధమైన 6417 ఫిర్యాదులు అందాయని వాటిలో కొన్ని పనులు పూర్తి చేసి ఉ న్నప్పటికి యాప్ లో పరిష్కార తీరు అప్ లోడ్ చేసి ఉండకపోవచ్చునని ఆయన అన్నారు. ఈ దృష్ట్యా అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించాలని ఆయన సూచించారు. రానున్న 45 రోజులపాటు అప్రమత్తంగా వుండి డెంగీ, మలేరియా వంటి కేసులు ఒకటి కూడా నమోదు కాని రీతిలో పనిచేయాలన్నారు. డెంగీ మలేరియా జ్వరాలకు మూలమైన దోమల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ పంచాయతీల్లో స్పెయింగ్ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు కాలువలు, నీరు నిల్వ వున్న చోట్ల ఆయిల్ లాల్స్ వేయించాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే గా పాటించాలన్నారు. జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధులు ప్రభల కుండా ప్రతీ రోజు పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీ మలేరియా సట్ యూనిలో కనీసం 1000 పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలో విజయవాడ జిజిహెచ్, మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి, గుడివాడ, నూజివీడు ఏరియా ఆసుపత్రిలో డెంగీకి సంబందించి ఎలిసా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మలేరియాకి సంబంధించి అన్ని పిహెచ్ సిల పరిధిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మైలవరం, అగిరిపల్లి తదితర మండలాల్లో మరింత అప్రమత్తంగా వుండాలన్నారు. డెంగీ లక్షణలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రజల నుంచి యాలో అందిన ఫిర్యాధుల్లో ఎక్కువగా విజయవాడ అర్బన్లో 552, రూరల్ లో 274, మచిలీపట్నం రూరల్ లో 260, కలిదిండిలో 242, వీరులపాడులో 233, ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కారించాలన్నారు. పిర్యాదుల పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శలకు, ఇఓఆర్డిలకు అభినందనలు:
ఆదివారం నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 1.83 లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా గత విడత 1.46 లక్షల మందికి వ్యాక్సినేషన్ అందించగలిగామని ఇందుకు పంచాయతీ కార్యదర్శులను, ఇక ఆడిలను కలెక్టర్ జె. నివాస్ అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం వెనుక గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని మోబైలైజేషన్ చేయడమేనని ఆయన గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్ లో నిర్వహించే మోగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు, హౌసింగ్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో నాయకత్వం వహించాలన్నారు.
ఈ సమావేశంలో జడ్పి సిఇఓ సూర్యప్రకాష్, డిపిఓ జ్వోతి, డియంహెచ్ఓ డా.యం సుహాసిని, మచిలీపట్నం మున్సిపల్ కమీషనర్ శివరామకృష్ణ, విజయవాడ డిఎ పిఓ చంద్రశేఖర్‌లతోపాటు వివిధ డివిజన్ల డిఎలిపివోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇవోఆర్డిలు, మలేరియా సబ్ యూనిట్ వైద్య సిబ్బంది గ్రేడ్-1, గ్రేడ్-2, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *