విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ రైల్వే, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, రైల్వేస్ ఇంజినీర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైల్వేలకు సంబంధించి ఆయా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అనుకూలమైన చర్యలు వేగవంతం చేయాలన్నారు. గన్నవరం మండలం వెదురుపావులూరు దగ్గర రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి, విజయవాడ కాజీపేట మధ్య రైల్వే లైన్ విస్తరణకు సంబంధించి గొల్లపూడి వద్ద భూసేకరణ, అలైన్మెంట్ మార్పు తదితర అంశాలపై సమీక్షించారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …