మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఏడాదికి 125 రోజుల పని దినాలు కల్పిస్తూ కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్….. వి.బి. జి రాంజీ పథకాన్ని వచ్చే 2026 27 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి రానుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశ మందిరంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ రూపొందించిన వికసిద్భారత్ జి రాంజీ 125 రోజుల ఉపాధి హామీ పేరుతో గోడ పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇది గ్రామీణ అభివృద్ధికి నూతన సంకల్పం, ఉపాధికి కొత్త హామీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ దోమ పిడి శివప్రసాద్ మెప్మా పీడీ సాయిబాబు, సర్వ శిక్ష ఏపి సి కుమిదిని సింగ్, డిఎస్పి శ్రీనివాసరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News