Breaking News

మీకోసం అర్జీలను సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే మీకోసం అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం సంయుక్త కలెక్టర్, మెప్మా పిడి సాయిబాబు, సర్వ శిక్ష ఏపీసి కుమిదిని సింగ్, డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక. …మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 122 అర్జీలను జిల్లా యంత్రాంగం స్వీకరించింది. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించే మీకోసం అర్జీలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ ఉన్నారన్నారు. జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి సంబంధించిన అర్జీలను సానుకూలంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి శివప్రసాద్, జలవనరుల శాఖ ఈ ఈ కిరణ్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఐసిడిఎస్ పిడి ఎం ఎన్ రాణి, మార్కెటింగ్ ఏది నిత్యానందం, సి పి డి సి ఎల్ ఎస్ ఈ పి రవీంద్రబాబు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *