Breaking News

వై.యన్.ఆర్ చారిటీస్ వారి సేవ కార్యక్రమాలు అభినందనీయం : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ స్పూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైయన్ఆర్ చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న సోదరుడు యలమంచిలి జయ ప్రకాష్ సేవలు అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం యలమంచిలి జయ పుట్టినరోజు సందర్భంగా ఎన్ కే పాడు నందు గల కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు ప్రతి డివిజన్ లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తదనంతరం వైయన్ఆర్ చారిటీస్ వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బడ్డి కోట్లు, తోపుడు బండ్లను అవినాష్ లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని నెహ్రూ హయం నుండి కూడా యలమంచిలి జయ కు మా కుటుంబంతో ఉన్న సన్నిహిత్యంతో తాను చేపట్టే ప్రతి సామాజిక సేవ కార్యక్రమంలలో నన్ను భాగస్వామినీ చేయడం సంతోషంగా ఉందని, నాన్న దేవినేని నెహ్రు గారి సేవా స్పూర్తితో తన చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలిచిన వారి సేవలు అభినందనీయం అని అన్నారు.రాబోయే రోజుల్లో కూడా వారి సేవ కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరగాలని వారికి నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జయ ప్రకాష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అవినాష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇన్ చార్జ్ లు, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మరియు వై.యన్.ఆర్ అభిమానులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *