అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యక్తిత్వం, విశ్వసనీయత ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కలిగి వుండాల్సిన ప్రధాన లక్షణాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్న విషయం ఉద్యోగులకు శిరోధార్యం కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త కమిషనర్ మొగిలిచెండు సురేశ్ పేర్కొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక డిప్యూటీ కమిషనర్ రవిచంద్రారెడ్డి అధ్యక్షతన సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన తాడేపల్లి పరిధిలోని వార్డు సచివాలయాల సిబ్బందికి, వార్డు వాలంటీర్లకు నిర్వహించబడిన పునశ్చరణ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల సంయుక్త కమిషనర్ మొగిలిచెండు సురేశ్ ముఖ్య అతిథి గా విచ్చేసి, దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో ఆయన స్పందన, ప్రవర్తన నియమావళి, సీసీఏ నియమావళి, కార్యాలయ నడవడిక, సమాచార నడవడిక గురించి మూడు గంటల పాటు అవగాహన కల్పించారు. ముఖ్య మంత్రి ఆకాంక్షల మేరకు గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు దేశం గర్వించే స్థాయిలో విధి నిర్వహణ చేస్తున్నారన్నారు. సూర్యకిరణాలు పింఛనుదారుల తలుపులు తాకకముందే, పింఛన్లు పంపిణీ చేస్తున్న ఘనత మన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది & గ్రామ, వార్డు వాలంటీర్లకు దక్కుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సంక్షేమ సారథులని, వాలంటీర్లు ప్రభుత్వ పథకాల వారధులని వివరించారు. ప్రవర్తన నియమావళి లోని నియమాలను తుచ తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి ఉద్యోగి తన విధి పట్ల భక్తిభావం కలిగి వుండాలి.సంపూర్ణ నైతిక నిష్టత, క్రమశిక్షణ, నిష్పాక్షికత, ఔచిత్య భావన, సమయపాలన, సత్వరత , విధేయత, సక్రమ హాజరీ కలిగి వుండాలన్నారు. ప్రజల పట్ల మర్యాద, మన్నన కలిగా వుండాలి. స్పందన అర్జీల పరిష్కారం లో సత్వరమే స్పందించాలి. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినవారు సీసీఏ నియమావళి మేరకు క్రమశిక్షణాచర్యలకు బాధ్యులవుతారన్నారు. పై అధికారుల పట్ల గౌరవం, సాటి సిబ్బంది పట్ల మర్యాద కలిగి వుండాలని సోదాహరణలతో, మూడు గంటల పాటు గ్రామ, వార్డు సచివాలయాల సంయుక్త మొగిలిచెండు సురేశ్ గారు విశదీకరించారు. ఈ పునశ్చరణ కార్యక్రమంలో నగరపాలక అదనపు కమిషనర్ హేమామాలిని, నగరపాలక ఉన్నత్యోద్యోగులు, స్పందన లిటిల్ మధు, పీఎంయు రాజేశ్, ఆర్టీఐ ముజాహద్దిన్, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …