అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను చట్టం-1963 ప్రకారం 31-12-2021 త్రైమాసిక ముగింపుకు సంబంధించి 31 అక్టోబరు 2021 లోగా చెల్లించాల్సిన మోటారు వాహనాల పన్ను చెల్లించే గడువును మరో నెల గ్రేస్ ఫీరియడ్ గా అనగా నవంబరు 30వ తేదీ వరకూ పొడిగించిన్నట్టు రాష్ట్ర టిఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 328 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.కావున ఈనెల 30వతేదీ లోగా మోటార్ ట్రాన్సుపోర్టు వాహనాల పన్నును చెల్లించాల్సిందిగా ఆయన తెలియజేశారు.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …