Breaking News

ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఖాదీభారతం పోస్టరును ఆవిష్కరించిన కలెక్టరు…

-ఈ నెల 26,27 తేదీల్లో ఐజీయం సేడియంలో ర్యాలీ, పీబీ సిద్దార్థ కళాశాలలో సాంస్కృతి ప్రదర్శనలు నిర్వహిస్తాం…
-జిల్లా కలెక్టరు జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాధీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రెండు రోజులు పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించండ జరుగుతుందని కలెక్టరు జె. నివాస్ అన్నారు.
నగరంలోని జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా రెండు రోజులు పాటు జిగ్నాసా ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు సంబందించిన ఖాదీ భారతం పోస్టరును మంగళవారం కలెక్టరు జె. నివాస్ అధికారులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ నెల 26,27 తేదీల్లో రెండు రోజులు పాటు దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విదంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 26 వ తేదీ ఇందిరాగాంధీ స్టేడియంకు నాలుగు వైపులా ఎస్ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీబీ సిద్దార్థా డ్రిగ్రి కళాశాల, బాపూజీ మ్యూజియం, బెంజ్ సర్కి నుంచి సుమారు 4,075 మంది విద్యార్థులతో ఉదయం 7 గంట నుంచి వివిధ సాంప్రదాయ వేషదారణలతో, నృత్యాలు, సంగీత వాయిద్యాలతో దేశ సంస్కృతీ సప్రదాయాలను తెలియజేసే విధంగా ర్యాలీని నిర్వహించి ఉదయం 11 గంటలకు ఇందిరాగాంధి స్టేడియంకు చేరుకుని భారత్ మ్యాప్ ఆకృతిలో విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఈ రెండు రోజులు పాటు మొగల్రాజపురం పీబీ సిద్దార్థ డిగ్రీ కళాశాలలో ఖాదీ భారతం సంప్రదాయ వస్త్రధారణ, భారత సంస్కృతి, వీధినాటకం, సంస్కృతి ధర్పణ్, ఎక్ భారత్, శ్రేష్టభారత్ బృంద నృత్యాలు, పాఠలు, అభినయం, చిత్రలేఖనం, వ్యకృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించడం జరగుతందన్నారు. ఇందులో 6 వ తరగతి విద్యార్థుల నుండి 30 సంవత్సరాలు వయస్సు గల యువతీ యువకులు ముందుగానే తమ పేర్లును నమోదు చేసుకోవచ్చునని, అదేరోజు ఉదయం వెన్యూవద్ద కూడ నమోదు చేసుకొని పాల్గొనవచ్చునన్నారు. ఈ రెండు రోజులు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టరు(ఆసరా) కె. మోహన్ కుమార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టరు జె. నివాస్ తెలిపారు. కార్యాక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో సూర్యచంద్రరావు, జిగ్నాసా డైరెక్టరు భార్గవ్, కార్యక్రమం కన్వీనర్ గాయత్రి, కో ఆర్డినేటర్ భావనాషా పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *