కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అణగారిన వర్గాల చైతన్య స్ఫూర్తిగా పిలవబడే భారత రత్న డా.బి ఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడు , ఆయనను కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి అపాదించలేమని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లి బాబు పేర్కొన్నారు. 72 వ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా శుక్రవారం కొవ్వూరు మెరక వీధిలో ఏర్పా టు చేసిన డా.బి ఆర్ అంబేద్క ర్ విగ్రహానికి ఆర్డీఓ మల్లిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బొంతా శ్యామ్ రవిప్రకాష్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమం లో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ కి ఛైర్మన్ గా ప్రపంచా లలో ని పలు దేశాల్లో జరిగిన విప్లవాలను జాగ్రత్తగా అధ్య యనం చేసి రాజ్యాంగ రచన చెయ్యడం జరిగిందన్నా రు. న్యాయ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, స్వేచ్ఛా భావన, భావప్రకటన, నమ్మకం, విశ్వా సం, గౌరవం, సమానత్వం, అవకాశాలను పెంచుట సౌభ్రాతృత్వం, వ్యక్తి హోదా, జాతి ఐక్యత, సమగ్రతను పెంపొందించుటే రాజ్యంగం ఉద్దేశ్యం అన్నారు. దీన్ని గౌర వించడం మన అందరి కర్తవ్యం అన్నారు. కొందరు వ్యక్తులను చరిత్ర ను సృష్టిస్తుంది, కొందరు వ్యక్తులు చరిత్రను సృష్టిస్తారు, ఆ రెండోవ కోవకు చెందిన వ్యక్తి డా.బి. ఆర్. అంబేద్కర్ అన్నారు. ప్రెంచ్ విప్లవం, ఐర్లాండ్ తిరు గుబాటు, అమెరికాలో మార్టిన్ లుదార్ కింగ్ నుంచి పొందిన స్ఫూర్తి, సోషలిస్టు విప్లవం వంటి ఎన్నో ఘటనల అనుభవా లు జోడించి రాజ్యాంగ రచన చేశారు. ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నా, నేను అనే పదం రాకుండా మాకు మేము రూపొందించు కున్న రాజ్యాంగ వ్యవస్థ గా పేర్కొనడం ఆయన గొప్పతననానికి, వ్యక్తిత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడి అంబేద్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మమ్మి, ఎస్ ఐ, యు.లక్ష్మీనారా య ణ, ఏ. ఎస్.డబల్ యు. ఓ, కె.ఎస్.ఎన్. సత్యనారాయణ, యమ్. శాంతి సాగర్, అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, మాసా ఆనంద్, కప్పల రాజేష్, టి. బంగారయ్య తదితరులు పాల్గొని, రాజ్యాంగ స్ఫూర్తి సందేశం ఇచ్చారు.
Tags kovvuru
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …