ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే జగనన్న అమూల్ పాలవెల్లువ పధకంను పటిష్టంగా అమలు చేసిందేందుకు కృషి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. కె. మాధవీలత అన్నారు. అగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లిలో జగనన్న పాలవెల్లువ పధకం ప్రగతిపై అధికారులు, మహిళలతో సమీక్షించారు. ఈ సందర్భంగా డా. మాధవీలత మాట్లాడుతూ మహిళా పాడి రైతుల పాలైన జగనన్న అమూల్ పాలవెల్లువ పధకం ఒక వరం వంటిదన్నారు. ఈ పధకం కింద జిల్లాలో తొలివిడతగా 300 గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలందరూ ఐక్యతతో జగనన్న చేయూత, జగనన్న ఆసరా, జగనన్న తోడు వంటి పధకాల ద్వారా అందిన ఆర్ధిక సహాయంతో మహిళలు పాడి పశువులను కొనుగోలు చేసి పాల సేకరణ పెంచాలన్నారు. గ్రామంలోని రైతు భరోసా కేంద్రం పరిధిలోని పాడి పశువులు కలిగిన మహిళలను గుర్తించి మహిళా డైరీ అసోసియేషన్ కమిటీ గా రిజిస్టర్ చేసి, వాటి పనితీరు ఆధారంగా 90 రోజుల తరువాత మహిళా డైరీ సహకార సంఘంగా రిజిస్టర్ చేయాలన్నారు. అగిరిపల్లి మండలంలో మొత్తం 1512 మంది మహిళలు పాడి పశువులు కలిగిన మహిళలుగా గుర్తించడం జరిగిందని, చిన ఆగిరిపల్లిలోని 8 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 240 మంది మహిళలు పాడి పశువులు కలిగిన మహిళలుగా గుర్తించడం జరిగిందన్నారు. మహిళా డైరీ అసోసియేషన్ కమిటీ లో 11 మంది ప్రమోటర్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వీటి నిర్వహణకు ఒక సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ లను నియమించడం జరుగుతుందన్నారు. జగనన్న పాల వెల్లువ పధకం మార్గదర్శకాలపై క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అవగాహనా కలిగించాలన్నారు. అనంతరం చిన ఆగిరిపల్లిలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాలను నోటీసు బోర్డులు తప్పటిసారిగా ప్రదర్శనకు ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట నూజివీడు రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి, తహసీల్దార్ వి.వి. భరత్ రెడ్డి, ఎంపిడిఓ పి. భార్గవి, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Tags agiripalli
Check Also
ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ …