Breaking News

ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రోత్సహిస్తాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సిల్వర్ మెడల్ విజేత విద్యాధర్ కు ఎమ్మెల్యే అభినందన

-విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. స్పెయిల్ లో జరిగిన ప్రపంచ సీనియర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్(డబుల్స్) సిల్వర్ మెడల్ విజేత జె.బి.ఎస్.విద్యాధర్ ను ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో శాసనసభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు ఎందరో ఉన్నారని, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారికి సరైన గుర్తింపు దక్కుతుందని అన్నారు. క్రీడా రంగంలో రాణిస్తూ రాష్ట్రస్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ పరంగా అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. గడిచిన రెండున్నరేళ్లలో ఎంతో మంది క్రీడాకారులను సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తుచేశారు. పీవీ సింధూ, హాకీ క్రీడాకారిణి రజనీలను ప్రొత్సహించినట్లే ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రొత్సహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఎందరో క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ సహకారంతో క్రీడాకారులకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తామని మల్లాది విష్ణు  అన్నారు. విద్యాధర్ ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *