Breaking News

స్పందన దరఖాస్తులను పరిష్కారంలో అలసత్వం వద్దు : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సోమవారం స్పందన కార్యక్రమంలో 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా సత్వరమే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన అర్జీదారులు ఎంతో ఆశతో సమస్యలు పరిష్కారంకోసం కార్యాలయాలకు వస్తుంటారని వారిని పలుమార్లు కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోకుండా ధరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారించాలన్నారు. . స్పంధన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అర్జీ తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కారానికి అర్హత దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పరిష్కారాన్ని వీలుకాని దరఖాస్తులను అందుకు గలా కారణాలను ధరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెలియజేయలన్నారు. స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి హెచ్చరించారు.

నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు మల్లవల్లి పారిశ్రామికవాడకు ఉత్తరం దిక్కున ఉన్న సరిహద్దు డొంక రోడ్డు మూసివేయడంతో రైతులు, ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం వెళ్ళుటకు సమస్యగా ఉన్నాదని, సదరు డొంక రోడ్డును యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ విషయంగా విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసారు. ముసుంరు మండలం ముసునూరు గ్రామానికి చెందిన గొల్లపల్లి సుబ్బారావు తన దరఖాస్తులో తనకు ముసునూరులోని భారతీయ కాలనీలో తనకు 35వ నెంబర్ ఇచ్చారని, ఆర్ధిక ఇబ్బందివల్ల వేరే ఊరు వెళ్లి పనిచేస్తున్నానని, ఈ సమయంలో నా స్థలాన్ని వేరే వ్యక్తులు ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలనీ కోరగా, వెంటనే ముసునూరు తహసీల్దార్ కు ఫోన్ చేసి, సదరు సమస్యను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముసునూరు మండలం వలసపల్లి గ్రామ శివారు నత్తావారిగూడెం గ్రామానికి చెంది బొప్పన రాధాకృష్ణ తనకు బయో మెట్రిక్ లో వేలిముద్రలు, ఐరిష్ పడని కారణంగా పెన్షన్ అందించడం లేదని, తనకు న్యాయం చేయాలనీ కోరగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు. ఏ . కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో పిచ్చి కుక్కల కారణంగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, వాటి బారిన పడకుండా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ శాఖాధికారులను ఆదేశించారు. ముసునూరు మండలం గుళ్లపూడి గ్రామ పరిధిలోని వలసపల్లి గ్రామస్తులు షుమారు 10 వరకు తాము 20 సంవత్సరాల నుండి తమ పూర్వీకుల ద్వారా సంక్రమించిన పొలాలను సాగు చేసుకుంటున్నామని, వాటిని తమకు తెలియకుండా వేరే వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలను రెవిన్యూ అధికారులు జారీ చేసారని, తమకు న్యాయం చేసి సదరు భూములకు తమ పేరిట పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయాలనీ కోరగా, వెంటనే సదరు తహసీల్దార్కు ఫోన్ చేసి సదరు సమస్యపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆర్డీఓ రాజ్యాలక్ష్మి ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో డివిజనల్ పరిపాలనాధికారి యం. హరనాధ్, ఇరిగేషన్ ఈ.ఈ., కె.ఎల్.ఎన్. ప్రశాంతి, పంచాయతీరాజ్ అధికారి ఎం. బసవయ్య, డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసరు కె. భాస్కరరావు, అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ అధికారి ఏ .దివ్య, హార్టికల్చర్ ఏ డి జ్యోతి, హార్టికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. రత్నమాల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *