Breaking News

పాఠశాల విద్యాశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వంచారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ…

వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం
విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్న సీఎం
సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం
నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం
వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్న సీఎం
వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందన్న సీఎం
ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం
ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం: సీఎం
ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చండి: సీఎం
ఒకటి కో – ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్‌ కళాశాలగా మార్చాలి:సీఎం

ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్న సీఎం
మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు
ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం
ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

పలురకాల ఆప్స్‌ కన్నా… రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలన్న సీఎం
అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్న సీఎం
విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీచేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ

పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్న ఎస్‌ఈఆర్‌టీ
హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ
వీటికి ఆమోదం తెలిసిన సీఎం

స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు
త్వరగా పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశం
ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు
సెప్టెంబరుకల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు

జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు
ఇది సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం

స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలన్న సీఎం
ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలన్న సీఎం
ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశం
పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలన్న సీఎం
డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
8,9,10  తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలన్న సీఎం
దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలన్న సీఎం

ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *